Gold and Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price Today: దేశీయంగా బంగారం ధరలు నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే దేశీయంగా బంగారం ధరపై..

Gold and Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2021 | 6:57 AM

Gold and Silver Price Today: దేశీయంగా బంగారం ధరలు నిన్నటి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే దేశీయంగా బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి. భారతీయులు వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి వస్తువులను కొనుగోలుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే గత కొంతకాలంగా బంగారం కొనుగోలుని ఒక పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండి పై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ఒకొనొక సమయంలో పసిడి ధరలు ఆల్ టైం హై కి చేరుకున్నాయని  మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన  పసిడి, వెండి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈరోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు గురించి తెలుసుకుందాం..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో  22 క్యారెట్ల  గ్రాము  బంగారం ధర శనివారం రూ. 4,570 లు ఉంది. అయితే ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుండడంతో ఈరోజు ఉదయం కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 10గ్రాముల బంగారం ధర శనివారం రూ. 45700లు ఉండగా అదే ధర ఆదివారం ఉదయం కూడా ఉంది.

24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ గ్రాము ధర శనివారం రూ. 4,985 లు ఉంది. ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతుండడంతో ఈరోజు కూడా గ్రాము బంగారం ధర రూ. 4,985 లు ఉంది. 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 49,850 లు ఉంది. ధర స్థిరంగా కొనసాగుతుండడంతో నేటి ఉదయానికి కూడా 10 గ్రాముల బంగారం ధర  రూ. 49,850 లు గా కొనసాగుతుంది.

ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

 దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,850 లు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 లు గా ఉంది.

దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలో  22 క్యారెట్ల బంగారం ధర రూ.47,690లు గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,690 గా ఉంది.

చెన్నై లో   22 క్యారెట్ల బంగారం ధర రూ.45,940లు గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,120 గా ఉంది.

పశ్చిమ బెంగాల్ లోని ప్రధాన నగరం కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,850లు గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,550 గా ఉంది.

వెండి ధరలు: మనదేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువులను ఖరీదు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదు టంకశాలలో కూడా వెండిని ఉపయోగిస్తారు.  ఈ నేపథ్యంలో మనదేశంలో కిలో వెండి ధర    ఈరోజు ఉదయానికి రూ.500 మేర పెరిగి 62,120 లకు చేరుకుంది.