- Telugu News Photo Gallery Business photos Kia Carens: Kia is bringing new 7 seat MPV, features will be great
Kia Carens: కొరియా ఆటో దిగ్గజం కియా నుంచి కొత్త కారు.. మూడు వరుసల్లో 7 సీట్లు ఉండేలా డిజైన్
Kia Carens: మార్కెట్లో రకరకాల కార్లు విడులవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ కార్ల కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను పోడిస్తూ మార్కెట్లో వివిధ రకాల మోడళ్లను ..
Updated on: Dec 18, 2021 | 9:44 PM

Kia Carens: మార్కెట్లో రకరకాల కార్లు విడులవుతున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ కార్ల కంపెనీలు అత్యాధునిక ఫీచర్స్‌ను పోడిస్తూ మార్కెట్లో వివిధ రకాల మోడళ్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు.

ఇక తాజాగా కొరియా ఆటో దిగ్గజం కియా భారత మార్కెట్‌కు కారెన్స్ కారును పరిచయం చేసింది. భారత్ ద్వారానే ఈ కారును ప్రపంచ మార్కెట్‌కు ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారు మూడు వరుసలతో 7 సీట్లు ఉండేలా తయారు చేసింది.

ఈ కారు 2022లో తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే కారెన్స్‌లో అన్ని మోడళ్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు కూడా ఉండేలా కారును డిజైన్ చేసింది కంపెనీ. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ వెర్షన్లు రెండింటిలోనూ అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ఫ్యాక్టరీలో ఇది తయారవుతుందని కంపెనీ ఎండీ, సీఈఓ తే జిన్ పార్క్ తెలిపారు. ఈ కారులో వినియోగదారులను ఆకట్టుకునేలా ఫీచర్స్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.





























