- Telugu News Photo Gallery Business photos EeVe Soul electric scooter launched in India with 120km range and 60Kmph top speed: price, specifications
Electric Scooter: ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు.. అదిరిపోయే ఫీచర్స్‌తో రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్
Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానే ..
Updated on: Dec 19, 2021 | 7:31 PM

Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానే ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి రాగా, తాజాగా ఈవీ ఇండియా అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.39 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది కంపెనీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూరోపియన్ టెక్నాలజీ ఆధారంగా వస్తోందని కంపెనీ వెల్లడించింది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఐఓటీ ఎనేబుల్డ్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, జీపీఎస్ నావిగేన్, యూఎస్‌బీ పోర్ట్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్, జియో ట్యాగింగ్, కీలెస్ ఫీచర్, రివర్స్ మోడ్ ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి.

ఈ స్కూటర్ మూడేళ్ల వారంటీతో వస్తోంది. ఈ స్కూటర్ బ్యాటరీలను ఎప్పటికప్పుడు మార్చుకునే సదుపాయం ఉంది. దీని బ్యాటరీ ఛార్జింగ్ పూర్తయ్యేందుకు సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్‌కు డ్యుయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 100 డీలర్‌షిప్‌లు, 300 సబ్ డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.





























