Jio vs Airtel vs VI: వార్షిక ప్లాన్ వర్సెస్ నెలవారీ రీఛార్జ్.. ఏది బెటరంటే? ఆ డేటా ప్లాన్‌పై రూ. 1008 ఆదా చేసే అవకాశం..!
నెలవారీ మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. కనీసం రూ. 50 నుంచి రూ. 100 ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వార్షిక ప్లాన్‌లు కూడా రూ.600 వరకు ఖరీదైనవిగా మారాయి.
Reliance Jio Vs Bharti Airtel Vs Vodafone Idea Yearly Recharge Plans: నెలవారీ మొబైల్ రీఛార్జ్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. కనీసం రూ. 50 నుంచి రూ. 100 ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. మీకు ఎంత ఇంటర్నెట్ డేటా అవసరమో దానికి సంబంధించిన ఖర్చు కూడా ఉంటుంది. వార్షిక ప్రణాళికలు రూ.600 వరకు ఖరీదైనవిగా మారాయి. దీని తర్వాత కూడా, వార్షిక ప్లాన్ నెలవారీ ప్లాన్ కంటే చౌకగా ఉంటుంది. ఈ వార్తలో, డేటా రీఛార్జ్ ఖర్చుకు సంబంధించిన పూర్తి లెక్కలను మీకు అందిస్తున్నాం. అలాగే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే వార్షిక ప్లాన్‌లో ఏది అత్యంత చౌకైనది.
రిలయన్స్ జియో వార్షిక ప్లాన్ ఎలా ఉందంటే.. మొదట రిలయన్స్ జియో గురించి మాట్లాడుకుందాం. జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ. 44 కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉంది. జియో వార్షిక ప్లాన్ రూ. 2879 తీసుకుంటే.. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులుగా ఉంది. అపరిమిత ఎస్‌ఎంఎస్, అపరిమిత కాలింగ్ వంటి ఇతర ఫీచర్లు కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దీనిని జియో రూ. 299 ప్లాన్‌తో పోల్చి చూస్తే.. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
జియో రూ.2879 సూపర్ వాల్యూ వార్షిక ప్లాన్ రోజువారీ ధర రూ.7.89గా ఉంది. అదే సమయంలో, రూ. 299 నెలవారీ ప్లాన్ రోజువారీ ధర రూ. 10.68గా ఉంది. ఒక వినియోగదారుడు రూ. 299 ప్లాన్‌ని ఉపయోగిస్తుంటే, అతను ఒక సంవత్సరంలో 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం అతని ఖర్చు రూ.3887లు అవుతుంది. అంటే వార్షిక ప్రణాళిక కంటే రూ.1008 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
భారతీ ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్ చూస్తే.. భారతీ ఎయిర్‌టెల్ దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ. దీనికి దేశవ్యాప్తంగా 35 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ వార్షిక ప్లాన్‌ని పోల్చి చూద్దాం.. ఈ ప్లాన్ ధర రూ. 2999గా ఉంది. ఇందులో, రోజువారీ 2GB డేటా 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. అపరిమిత SMS, అపరిమిత కాలింగ్ సౌకర్యాలు కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దీనిని ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్‌తో పోల్చిచూద్దాం. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటా, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
జియో రూ. 2999 వార్షిక ప్లాన్ రోజువారీ ధర రూ. 8.22గా ఉంది. అదే సమయంలో, రూ. 359 నెలవారీ ప్లాన్ రోజువారీ ధర రూ. 12.83గా ఉంది. ఒక వినియోగదారుడు రూ. 359 ప్లాన్‌ని ఉపయోగిస్తుంటే, అతను ఒక సంవత్సరంలో 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం అతని ఖర్చు రూ.4667 అవుతుంది. అంటే వార్షిక ప్రణాళిక కంటే రూ.1668 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా ఇయర్లీ ప్లాన్ ధర.. Vodafone Idea, దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయినప్పటికీ, వీఐకి జియో, ఎయిర్‌టెల్ వంటి 2GB రోజువారీ డేటాతో వార్షిక ప్లాన్ లేదు. అటువంటి పరిస్థితిలో, మేం రోజువారీ 1.5GB డేటాతో వార్షిక ప్లాన్‌ను తీసుకుంటే దీని ధర రూ. 3099గా ఉంటుంది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీతో రోజూ 1.5GB డేటా లభిస్తుంది. అపరిమిత SMS, అపరిమిత కాలింగ్ సౌకర్యాలు కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని Vi రూ. 299 ప్లాన్‌తో పోల్చి చూస్తే.. ఈ ప్లాన్‌లో రోజువారీ 1.5GB డేటాతోపాటు ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
Vodafone Idea రూ. 3099 వార్షిక ప్లాన్ రోజువారీ ధర రూ. 8.50గా ఉంది. అదే సమయంలో, రూ. 299 నెలవారీ ప్లాన్ రోజువారీ ధర రూ. 10.68గా ఉంది. ఒక వినియోగదారుడు రూ. 299 ప్లాన్‌ని ఉపయోగిస్తుంటే, ఒక సంవత్సరంలో 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం అతని ఖర్చు రూ.3887 అవుతుంది. అంటే, వార్షిక ప్రణాళిక కంటే రూ.788 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
జియో, ఎయిర్‌టెల్, వీఐ ఏది బెటర్? మూడు కంపెనీల వార్షిక ప్లాన్‌లలో జియో అత్యంత చౌకైనది. దాని రోజువారీ 2GB డేటాలో, వినియోగదారు సంవత్సరానికి రూ. 1008 ఆదా చేస్తున్నారు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ. 1668 ఆదా చేస్తారు. అయితే, జియోతో పోలిస్తే, ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ. 660 ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వొడాఫోన్ ఐడియా రోజువారీ 2GB డేటాతో ఏ వార్షిక ప్లాన్‌ను కలిగి లేదు. కానీ, రోజువారీ 1.5GB డేటా ప్లాన్‌తో, వారు వార్షిక రీఛార్జ్‌పై రూ. 788 ఆదా చేసే అవకాశం ఉంది.
Also Read: బిజినెస్‌లో ప్రభుత్వ బ్యాంకులను అధిగమిస్తున్న ప్రైవేట్ బ్యాంకులు.. కారణం ఏంటో తెలుసా..?
Electric Tractor: త్వరలో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ట్రాక్టర్.. ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ..