బిజినెస్‌లో ప్రభుత్వ బ్యాంకులను అధిగమిస్తున్న ప్రైవేట్ బ్యాంకులు.. కారణం ఏంటో తెలుసా..?
Private Banks: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు పార్లమెంట్‌లో బిల్లులు వచ్చాయో లేదో కానీ ఇప్పటికైతే దేశంలో ప్రైవేట్ బ్యాంకులదే హవా నడుస్తోంది.
Private Banks: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు పార్లమెంట్‌లో బిల్లులు వచ్చాయో లేదో కానీ ఇప్పటికైతే దేశంలో ప్రైవేట్ బ్యాంకులదే హవా నడుస్తోంది. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నెట్‌వర్క్ తగ్గిపోయి ప్రైవేట్ బ్యాంకుల నెట్‌వర్క్ విస్తరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం 2017 సంవత్సరం వరకు దేశంలో బ్యాంకు శాఖల నెట్‌వర్క్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ప్రభుత్వ బ్యాంకు శాఖలలో 4389 తగ్గుదల నమోదు కాగా ప్రైవేట్ బ్యాంకుల శాఖలు 7000 పెరిగాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు తగ్గిపోవడమే కాకుండా రుణాలిచ్చే వ్యాపారంలో వాటి వాటా కూడా తగ్గుతుండగా, ప్రైవేట్ బ్యాంకుల వాటా పెరుగుతుంది. మార్చి 2015 నాటికి క్రెడిట్ మార్కెట్‌లో ప్రైవేట్ బ్యాంకుల వాటా కేవలం 20.8% మాత్రమే అని డేటా చూపిస్తుంది, ఇది మార్చి 2021 నాటికి 35.4 శాతానికి పెరిగింది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలిస్తే క్రెడిట్‌లో వారి వాటా మార్చి 2015 వరకు మార్కెట్ 71.6 శాతం ఉండగా మార్చి 2021లో 56.5 శాతానికి తగ్గింది.
క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో ప్రైవేట్ బ్యాంకుల ఆధిపత్యం క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో ప్రైవేట్ బ్యాంకులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఒక్క SBI తప్ప ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్న వ్యాపారంతో పోల్చితే ఏ ప్రభుత్వ బ్యాంకు కూడా వీటి దరిదాపులలో లేదు. రిజర్వ్ బ్యాంక్ డేటాను పరిశీలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు దేశంలో 6.63 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ కస్టమర్లు నమోదయ్యారు. 1.52 కోట్లకు పైగా క్రెడిట్ కార్డ్ కస్టమర్లను కలిగి ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి. ఇందులో ఈ బ్యాంక్ అత్యధిక వాటాను కలిగి ఉంది.