Bigg Boss 5 Telugu Winner and Highlights: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Narender Vaitla

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 20, 2021 | 11:21 AM

Bigg Boss Telugu Season 5 Winner VJ Sunny Grand finale Event Highlights: బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ కు వచ్చేసింది. నేటితో సీజన్ 5 కు గుడ్ బై చెప్పనున్నారు హోస్ట్ నాగార్జున. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుండగా...

Bigg Boss 5 Telugu Winner and Highlights:  అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..
Sunny Winner

Bigg Boss Telugu Season 5 Winner VJ Sunny Grand finale Event Highlights: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 విజేతగా వీజే సన్నీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ను ఎగిరేసుకుపోయాడు. ఇక రన్నర్‌ అప్‌గా షణ్ముక్‌ జశ్వంత్‌ నిలవగా, సెకండ్‌ రన్నర్‌ అప్‌గా శ్రీరామ చంద్ర నిలిచాడు.

బిగ్‌బాస్‌ టైటిల్‌ను గెలుచుకున్న సన్నీకి అభిమానులు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు హంగామా చేస్తున్నారు. రాత్రి మొత్తం సంబరాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో సన్నీ అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు రానున్నాడు. విజేతగా నిలిచిన సన్నీని ర్యాలీగా తీసుకెళ్లడానికి ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉన్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Dec 2021 11:19 AM (IST)

    సన్నీ వారానికి ఎంత తీసుకున్నాడో తెలుసా..

    వీజే సన్నీ.. అలియాస్ అరుణ్ రెడ్డి.. జర్నలిస్ట్‏గా కెరీర్ ఆరంభించి కళ్యాణ వైభోగం సీరియల్‏ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇందులో జై పాత్ర ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నాడు సన్నీ. ఇక బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి రెండు రాష్ట్రాల ప్రజల మనసులను దొచుకున్నారు. అయితే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో వారానికి రెండు లక్షలు తీసుకున్నట్లుగా టాక్. అంటే 15 వారాల్లో రూ 30 లక్షలు సంపాదించినట్లుగా టాక్ నడుస్తోంది.

  • 20 Dec 2021 10:16 AM (IST)

    అరె ఎంట్రా ఇది.. షణ్ముఖ్ స్పీచ్ పై నెటిజన్స్ అసహనం..

    బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ గెలిచాడు. రన్నరప్‏గా షణ్ముఖ్ నిలిచాడు. అయితే రన్నరప్‏ స్పీచ్ కావాలని నాగార్జున కోరడంతో షణ్ముఖ్ మాట్లాడుతూ.. పర్లేదు.. ఏం పర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్నదే ముఖ్యం. పర్లేదు నేను అదే నమ్ముతాను.. అమ్మ నాన్న ఇక్కడ వరకు వచ్చారు. అందుకు సంతోషంగా ఉంది అంటూ మాట్లాడారు. అయితే షణ్ముఖ్ స్పీచ్ పై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్పీచ్‏లోనూ సన్నీపై కోపం చూపించడమేంటనీ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

  • 20 Dec 2021 09:40 AM (IST)

    ఒక్క వారానికి షణ్ముఖ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

    యూట్యూబ్‏లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సిరీస్‏తో షన్నూ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే క్రేజ్‏తో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు షణ్ముఖ్. మిగతా కంటెస్టెంట్లతో పోలీస్తే.. షన్నూ వారానికి రూ. 2 లక్షల వరకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

  • 20 Dec 2021 08:03 AM (IST)

    సిరి పారితోషికం ఎంతంటే..

    పటాకా ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ గా పేరు తెచ్చుకుంది సిరి హన్మంత్. ఇల్లు భావోద్వేగాల నిధి అయితే అందులో సిరివి నీవంటూ బిగ్ బాస్ సైతం సిరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్యూట్ నేస్ తో ఇంట్లో సభ్యులనే కాకుండా.. నాగార్జునను సైతం ఆకట్టుకుంది సిరి. టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచిన ఏకైక అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. గ్రాండ్‌ ఫినాలేలో ఐదో స్థానంలో ఎలిమినేట్ అయ్యింది సిరి. అయితే సిరి వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంటే పదిహేను వారాలకు గానూ .. సుమారు పాతిక లక్షల వరకు అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్.

  • 20 Dec 2021 07:39 AM (IST)

    టైటిల్ గెలిచిన సన్నీ.. ఇంకా ఏమేమి గెలుచుకున్నాడంటే..

    బిగ్‏బాస్ సీజన్ 5 ముగిసింది. బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. కేవలం బిగ్‏బాస్ సీజన్ 5 ట్రోఫీ కాకుండా.. సన్నీ.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ తరఫున షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు టీవీఎస్‌ కంపెనీకి చెందిన బైక్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.

  • 20 Dec 2021 07:14 AM (IST)

    అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

    బిగ్‏బాస్ సీజన్ 5 ట్రోఫీని వీజే సన్నీ సొంతం చేసుకున్నాడు. దీంతో అతని ఫ్యాన్స్ నెట్టింట్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో సన్నీ మేనియా కొనసాగుతుంది. సన్నీకి సంబంధించిన రేర్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు. అందులో సన్నీ జర్నలిస్ట్‏గా చేసిన సమయంలో నాగార్జున ఇంటర్వ్యూ చేయడం.. ఇప్పుడు అదే నాగార్జున చేతుల మీదుగా బిగ్‏బాస్ సీజన్ 5 ట్రోఫీ అందుకున్నాడంటూ అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • 20 Dec 2021 06:28 AM (IST)

    నెట్టింట్లో సన్నీ హావా..

    బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఇంట్లో ఎంటర్‏టైనర్‏గా పేరు సంపాదించుకున్న సన్నీ.. తెలుగు రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకుని బిగ్‏బాస్ సీజన్ 5 విన్నర్‏గా ట్రోఫీ అందుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సన్నీ ట్రెండింగ్‏లో ఉంది. #VJSunny అంటూ ట్విట్టర్ ఖాతాలో సన్నీ ట్రెండింగ్‏లో దూసుకుపోతున్నాడు.

  • 19 Dec 2021 10:55 PM (IST)

    ప్రేక్షకులకు నాగార్జున సర్‌ప్రైజ్‌..

    సాధారణంగా బిగ్‌బాస్‌ షో ముగిసిన 6 నెలల తర్వాత తర్వాతి సీజన్‌ వస్తుంది. అయితే బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ముగింపు వేదికపై నాగార్జున ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. 6వ సీజన్‌ను వచ్చే ఏడాది మొదట్లోనే తీసుకురానున్నట్లు నాగార్జున ఆడియన్స్‌కు ప్రామిస్‌ చేశారు. దీంతో బిగ్‌బాస్‌ నెక్ట్స్‌ సీజన్‌పై కూడా అందరిలో ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది.

  • 19 Dec 2021 10:50 PM (IST)

    అమ్మ అడిగిన గిఫ్ట్‌ను ఇచ్చాను: సన్నీ

    బిగ్‌బాస్‌ విన్నర్‌గా నిలిచిన సన్నీ భావోద్వేగానికి గురయ్యాడు. విజేతగా గెలిచిన తర్వాత సన్నీ మాట్లాడుతూ.. ‘నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, నా గెలుపుకును నాగార్జున మోటివేషన్‌, నా హౌస్‌ మేట్స్‌, నాకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. అమ్మ నా జీవితంలో మొదటి గిఫ్ట్‌ను అందించాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక షణ్ముక్‌ గురించి మాట్లాడుతూ.. హౌస్‌లో అందరి కంటే కూలెస్ట్‌ పర్సన్‌, షణ్ముఖ్‌, సిరిల మధ్య ఉన్న స్నేహం ఎంతో అద్భుతమైందంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.

  • 19 Dec 2021 10:42 PM (IST)

    గెలుపు ముఖ్యం కాదు..

    ఉత్కంఠతకు తెర దించుతూ సన్నీ బిగ్‌బాస్‌ 5 సీజన్‌ విజేతగా సన్నీ గెలిచాడు. ఇక రన్నర్‌ అప్‌గా షణ్ముఖ్‌ నిలిచాడు. ఈ సందర్భంగా రన్నర్‌అప్‌గా నిలిచిన షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. ‘ఏం పర్లేదు.. గెలుపు ముఖ్యం కాదు.. ఇంత దూరం వచ్చాను, నా పేరెంట్స్‌ను ఇంత వరకు తీసుకొచ్చాను అది చాలు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ట్రోఫీ వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

  • 19 Dec 2021 10:23 PM (IST)

    ఇద్దరు కంటెస్టెంట్‌లతో స్టేజ్‌పైకి వచ్చిన నాగార్జున..

    సీజన్‌ 5 ముగిసే చివరి క్షణంలో కూడా బిగ్‌బాస్‌ ప్రేక్షకులను ఉత్కంఠతకు గురి చేస్తున్నాడు. విన్నర్‌ ఎవరో తేల్చే క్రమంలో సస్పెన్స్‌ను మెయింటెన్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే హౌస్‌లో మిగిలిన సన్నీ, షణ్ముఖ్‌లను నాగార్జున స్టేజ్‌పైకి తీసుకొచ్చారు. ఇక బిగ్‌బాస్‌ విన్నర్‌ షణ్ముఖా, సన్నీనా అనేది మరికొన్ని క్షణాల్లో తేలిపోనుంది.

  • 19 Dec 2021 10:14 PM (IST)

    భారీ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. విన్నర్‌ ఎవరో తేల్చని ఫరియా..

    బిగ్‌బాస్‌ హిస్టరీలో తొలిసారి విన్నర్‌ను హౌస్‌లోనే ప్రకటించనున్నట్లు తెలిపిన నాగార్జున క్యూరియాసిటీని పెంచేశాడు. ఇందులో భాగంగా రెండు బాక్సుల్లో ఇద్దరిని చేతులు పెట్టమని చెప్పిన నాగ్‌.. గెలిచిన వారి చేతికి గ్రీన్‌ కలర్‌ అంటుకుంటుందని చెప్పారు. కానీ ఇద్దరు కంటెస్టెంట్‌ల చేతులకు బ్లూ కలర్‌ ఉండడంతో అంతా షాక్‌కి గురయ్యారు. ఈ ట్విస్ట్‌ తర్వాత నాగార్జున నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో బిగ్‌బాస్‌ విన్నర్‌ను ఎవరు ప్రకటించనున్నారన్నదానిపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

  • 19 Dec 2021 09:58 PM (IST)

    సన్నీ, షణ్ముఖ్‌లను చిల్‌ చేస్తోన్న చిట్టీ..

    సన్నీ, షణ్ముఖ్‌ల్లో విజేత ఎవరనే అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇద్దిరిలో ఉన్న నేపథ్యంలో హౌస్‌మేట్స్‌ను చిల్‌ చేయడానికి నాగార్జున ఫరియా అబ్దుల్లాను పంపించారు. దీంతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫరియా సన్నీ, షణ్ముఖ్‌లతో డ్యాన్స్‌ చేయిస్తూ వారి టెన్షన్‌ను పోగోట్టే ప్రయత్నం చేసింది. ఇక నాగార్జున ఆదేశాల మేరకు ఫరియా సన్నీ, షణ్ముక్‌లో ఒకరికి హార్ట్‌ సింబల్‌ ఇచ్చి విజేతను ప్రకటించనుంది.

  • 19 Dec 2021 09:54 PM (IST)

    బిగ్‌బాస్‌ హిస్టరీలోనే తొలిసారి..

    సాధారణంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ను స్టేజ్‌పై ప్రకటిస్తారు. కానీ తొలిసారి బిగ్‌బాస్‌ ఈ విషయాన్ని హౌస్‌లో తేల్చేయనున్నాడు. ఈ క్రమంలోనే ఫరియా అబ్దుల్లాను హౌస్‌లోకి పంపించాడు నాగార్జున. సన్నీ, షణ్ముఖ్‌లో విజేతను ఫరియా ప్రకటించనుంది.

  • 19 Dec 2021 09:40 PM (IST)

    శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యాడు.

    Bigg Boss 5 Telugu Winner and Updates: గోల్డెన్ బాక్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. హౌస్ లో ఉన్న వారిని టెంప్ట్ చేశాడు నాగచైతన్య.. శ్రీరామ్ చంద్ర ఎలిమినేట్ అయ్యాడు. చైతన్య శ్రీరామ్ చంద్రను తీసుకొని స్టేజ్ పైకి వచ్చేశాడు..

  • 19 Dec 2021 09:19 PM (IST)

    నాగార్జునకు సర్‌‌‌ప్రైజ్ ఇచ్చిన నాగ చైతన్య..

    Bigg Boss 5 Telugu Winner and Updates: కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న సీజన్ 5 జర్నీ ఏ.వీను చూపించారు నాగచైతన్య

  • 19 Dec 2021 09:16 PM (IST)

    బిగ్ బాస్ వేదిక మీద జూనియర్ బంగార్రాజు..

    Bigg Boss 5 Telugu Winner and Updates: బిగ్ బాస్ వేదిక మీదకు ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగచైతన్య..  ప్రో కబడ్డీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు చైతన్య..

  • 19 Dec 2021 09:10 PM (IST)

    హీరోయిన్ శ్రీయ అదిరిపోయే స్టెప్పులు. 

    Bigg Boss 5 Telugu Winner and Updates: డాన్స్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపిన హీరోయిన్ శ్రీయ.

  • 19 Dec 2021 09:00 PM (IST)

    మానస్ ఎలిమినేట్…

    Bigg Boss 5 Telugu Winner and Updates: మిగిలిన నలుగురిలో మానస్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు..

  • 19 Dec 2021 08:43 PM (IST)

    బిగ్ బాస్ స్టేజ్ పై శ్యామ్ సింగరాయ్ టీమ్ సందడి..

    Bigg Boss 5 Telugu Winner and Updates: బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు శ్యాం సింగరాయ్ టీమ్ .. నాని, సాయి పల్లవి, కృతిశెట్టి.

  • 19 Dec 2021 08:32 PM (IST)

    అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్ 

    Bigg Boss 5 Telugu Winner and Updates: ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాట పడుతూ.. అదిరిపోయే స్టెప్పులేసి బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

  • 19 Dec 2021 08:21 PM (IST)

    భీమ్లా నాయక్ పాటల సందడి..

    Bigg Boss 5 Telugu Winner and Updates: పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా నుంచి పాటలతో సింగర్ శ్రీకృష్ణ బిగ్ బాస్ స్టేజిపై అలరించాడు.

  • 19 Dec 2021 08:07 PM (IST)

    బిగ్‌బాస్‌ 5వ ఎలిమినేషన్‌

    Bigg Boss 5 Telugu Winner and Updates:బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరైన సిరి హనుమంత్‌ ఎలిమినేషన్‌ అయ్యింది. రశ్మిక మందన, దేవిశ్రీ ప్రసాద్‌లు ఆమెను హౌస్‌ నుంచి బిగ్‌బాస్‌ స్టేజీపైకి తీసుకువచ్చారు.

  • 19 Dec 2021 07:51 PM (IST)

    బిగ్‌బాస్‌ హౌస్‌లో పుష్ప టీమ్‌

    Telugu Bigg Boss Winner And Updates: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పుష్ప టీమ్‌ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు సుకుమార్‌, నటి రశ్మిక మందన, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో సందడి చేశారు. ఎలిమినేటెడ్‌ అయిన కంటెస్టెంట్‌ను హౌస్‌ నుంచి బయటకు తీసుకురానున్నారు.

  • 19 Dec 2021 07:43 PM (IST)

    బిగ్‌బాస్‌లోకి జగపతిబాబు, నవీన్‌ చంద్ర ఎంట్రీ

    Telugu Bigg Boss Winner And Updates: బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే కొనసాగుతోంది. ఇందులో హీరోలు జగపతిబాబు, నవీన్‌ చంద్రలు గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు.

  • 19 Dec 2021 07:32 PM (IST)

    డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న డింపుల్

    Bigg Boss 5 Telugu Winner and Updates: అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న డింపుల్ హయతి .. గద్దల కొండ గణేష్ లోని జర్రా జర్రా పాటకు డాన్స్ వేసింది.. ఆతరువాత ఖిలాడీ సినిమాలో పాటకు డాన్స్ వేసిన డింపుల్ ఆతర్వాత సమంత పాటకు సూపర్ స్టెప్పులు వేసింది..

  • 19 Dec 2021 07:19 PM (IST)

    పాటపాడి ఆకట్టుకున్న శ్రీరామ్..

    Bigg Boss 5 Telugu Winner and Updates: అందమైన పాటపాడి అలియాను, రణ్ బీర్ కపూర్ లని ఇంప్రస్ చేశాడు శ్రీరామ్ చంద్ర.. శ్రీరామ్ పాటకు రాజమౌళి కూడా ఫిదా అయ్యారు..

  • 19 Dec 2021 07:14 PM (IST)

    సన్నీకి అలియా ఐ లవ్ యు..

    Bigg Boss 5 Telugu Winner and Updates: రాజమౌళి, అలియా, రణ్ బీర్ ను చూసి ఆనందంలో కేరింతలు కొట్టారు.. సన్నీకి అలియా ఐ లవ్ యు చెప్పింది.  అలాగే బాలయ్య దబిడి దిబిడే అనే డైలాగ్ చెప్పింది అలియా..

  • 19 Dec 2021 07:11 PM (IST)

    తెలుగులో మాట్లాడిన అలియా- రణ్ బీర్.. 

    Bigg Boss 5 Telugu Winner and Updates:  తెలుగులో నమస్కారం చెప్పిన అలియా, రణ్ బీర్ ఆతర్వాత  ముద్దుగా మాట్లాడి కట్టిపడేసింది అలియా భట్.. ఆడియన్స్ అందరికి నా ముద్దులు అంటూ తెలుగులో మాట్లాడారు అలియా అండ్ రణ్ బీర్..

  • 19 Dec 2021 07:05 PM (IST)

    రణ్ బీర్ కపూర్- అలియా కలిసి వచ్చారు..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  ముందుగా బ్రహ్మాస్త్ర దర్శకుడు ఐయాన్ బిగ్ బాస్ వేదికమీదకు వచ్చాడు.. ఆతర్వాత రణ్ బీర్ కపూర్ అలాగే అలియా భట్ ఇద్దరు కలిసి వేదిక పైకి వచ్చారు..

  • 19 Dec 2021 07:03 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  బిగ్ బాస్ ఫినాలే కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. బిగ్ బాస్ వేదిక పై ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అదిరిపోయిందన్నారు నాగార్జున. గుజ్‌బంప్స్ వచ్చాయన్నారు నాగ్. ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ ను కాలపడం నాకు ఇష్టమన్నారు జక్కన్న. రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో నేను నటిస్తున్నా అన్నారు నాగార్జున.

  • 19 Dec 2021 06:53 PM (IST)

    మరో టాస్క్ ఇచ్చాడు నాగార్జున..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  చివరిగా ఒక టాస్క్ ఇచ్చాడు నాగార్జున.. అందరికి హార్ట్ సింబల్స్ ఇచ్చి.. హౌస్ లో ఇష్టమైన ప్లేస్ లో పెట్టమన్నాడు నాగ్. ముందుగా శ్రీరామ్.. లివింగ్ రూమ్ దగ్గర పెట్టాడు. అలాగే సన్నీ స్విమింగ్ పూల్ దగ్గర అని చెప్పాడు. మానస్ గార్డెన్ ఏరియా అన్నాడు.. షణ్ముఖ్ మొజ్ రూమ్ లో పెట్టాడు. ఇక సిరి సోఫాలో హార్ట్ సింబల్ పెట్టింది..

  • 19 Dec 2021 06:43 PM (IST)

    సూపర్ డాన్స్ లతో ఆకట్టుకున్న టాప్ 5 కంటెస్టెంట్స్

    Bigg Boss 5 Telugu Winner and Updates:  టాప్ 5 కంటెస్టెంట్స్ సూపర్ డాన్స్ లతో ఆకట్టుకున్నారు.. అదిరిపోయే స్టెప్స్ తో కుమ్మేసారు సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ

  • 19 Dec 2021 06:40 PM (IST)

    రాయిగా పంపించాం.. శిల్పంగా ఎదిగాడు..

    Bigg Boss 5 Telugu Winner and Updates: షణ్ముఖ్ ను చూసి చాలా గర్వపడుతున్నా అన్నారు షన్ను తండ్రి.. షణ్ముఖ్ ను రాయిగా పంపించాం.. శిల్పంగా ఎదిగాడు అని అన్నారు..

  • 19 Dec 2021 06:33 PM (IST)

    శ్రీరామ్ తల్లిదండ్రులు ఏమన్నారంటే..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  శ్రీరామ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కొడుకు విన్ అవ్వాలని కోరుకున్నారు.

  • 19 Dec 2021 06:31 PM (IST)

    ఎక్కువమంది సన్నీ, శ్రీరామ్ లో ఒకరు విన్ అవ్వాలన్న మాజీ హౌస్మేట్స్..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. సన్నీ విన్ అవ్వాలని కోరుకున్నాడు నటరాజ్.. అలాగే కాజల్ మాట్లాడుతూ.. సన్నీ విన్ అవ్వాలని అంది. ప్రియాంక మాట్లాడుతూ.. మానస్, సన్నీ, శ్రీరామ్ లో ఒకరు గెలవాలని కోరుకుంది ప్రియాంక. ప్రియ మాట్లాడుతూ శ్రీరామ్ విన్ అవ్వాలని కోరుకుంది. శ్రీరామ్ విన్ అవ్వాలని కోరుకుంది హమీద. ఉమాదేవి మాట్లాడుతూ.. సన్నీ విన్ అవ్వాలని కోరుకుంది ఉమా..

  • 19 Dec 2021 06:26 PM (IST)

    సన్నీ విన్ అవ్వాలన్న శ్వేతా…

    Bigg Boss 5 Telugu Winner and Updates:  ఇక హౌస్ లో ఉన్న వారిలో సన్నీ విన్ అవ్వాలని కోరుకుంది శ్వేతా.. జెస్సీ మాట్లాడుతూ… షణ్ముఖ్ విన్ అవ్వాలని కోరుకున్నాడు..

  • 19 Dec 2021 06:24 PM (IST)

    షన్ను విన్ అవ్వాలన్న లోబో..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  లహరి ని ఎవరు విన్  అవుతారు అని అడిగితే సన్నీ, శ్రీరామ్ ఇద్దరిలో ఒకరు విన్ అవుతారని చెప్పింది. లోబోని ఇదే ప్రశ్న అడిగితే షణ్ముఖ్ అని చెప్పాడు..

  • 19 Dec 2021 06:22 PM (IST)

    శ్రీరామ్ చంద్రకు సపోర్ట్ చేసిన రవి, సరయు, విశ్వ, ఆనీ

    Bigg Boss 5 Telugu Winner and Updates: బిగ్ బాస్ వేదిక పైకి వచ్చిన మాజీ కంటెస్టెంట్స్ తో ఎవరు విన్ అవ్వాలని అనుకుంటున్నారు అని అడిగితే.. రవి, సరయు, విశ్వ , ఆనీ తమకు శ్రీరామ్ విన్ అవ్వాలని కోరుకున్నారు.

  • 19 Dec 2021 06:18 PM (IST)

    ఆర్ఆర్ఆర్ నాటు పాటతో వచ్చిన నటరాజ్ మాస్టర్.. ఆనీ మాస్టర్

    Bigg Boss 5 Telugu Winner and Updates:  ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు డాన్స్ ఇరగదీసిన నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్.. ఊర మాస్ స్టెప్స్ తో కుమ్మేసిన నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్.

  • 19 Dec 2021 06:17 PM (IST)

    అదిరిపోయే స్టెప్పులేసి హమీద

    Bigg Boss 5 Telugu Winner and Updates:  పుష్ప ఏ బిడ్డా సాంగ్ కు మాస్ స్టెప్స్ వేసి అదరగొట్టిన హమీద..

  • 19 Dec 2021 06:15 PM (IST)

    పుష్ప రాజ్ గా వచ్చిన విశ్వ..

    Bigg Boss 5 Telugu Winner and Updates: పుష్ప టైటిల్ సాంగ్ తో వేదిక పైకి వచ్చాడు విశ్వ.. ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ స్టెప్పులేసి విశ్వ..

  • 19 Dec 2021 06:14 PM (IST)

    బాలయ్య పాతతో వచ్చిన కాజల్..

    Bigg Boss 5 Telugu Winner and Updates: అఖండలోని బాలయ్య పాటతో బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు ఆర్జే కాజల్, ప్రియా, లహరి…

  • 19 Dec 2021 06:12 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన జెస్సీ, ప్రియాంక , శ్వేతా వర్మ.. 

    Bigg Boss 5 Telugu Winner and Updates: చిన్నదో వైపు.. పెద్దదో వైపు పాటకు డాన్స్ వేస్తూ అలరించిన జెస్సీ, ప్రియాంక సింగ్ , శ్వేతా వర్మ.. ..

  • 19 Dec 2021 06:11 PM (IST)

    దిగు దిగు నాగా ఎంట్రీ ఇచ్చిన ఉమాదేవి..

    Bigg Boss 5 Telugu Winner and Updates:  దిగు దిగు నాగా అంటూ డాన్స్ తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు ఉమా దేవి. సింపుల్ సెటెప్స్ తో ఆకట్టుకున్నారు ఉమాదేవి..

  • 19 Dec 2021 06:08 PM (IST)

    గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.

    Bigg Boss 5 Telugu Winner and Updates: మొదలైన బిగ్ బాస్ ఫినాలే.. సూపర్ సాంగ్స్ కు అదిరిపోయే స్టప్పులతో ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.. అందమైన భామలతో డాన్స్ లు వేస్తూ సందడి చేసిన నాగార్జున

Published On - Dec 19,2021 5:19 PM

Follow us