Bigg Boss Telugu 5 Finale: సన్నీకి ఐలవ్యూ చెప్పిన అలియా భట్.. అతని రియాక్షన్ నెక్ట్స్ లెవల్..

Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ ఐదోసీజన్ గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో అట్టహాసంగా ప్రారంభంకానుంది. బాలీవుడ్, టాలీవుడ్ అతిథులతో ఎన్నడూ

Bigg Boss Telugu 5 Finale: సన్నీకి ఐలవ్యూ చెప్పిన అలియా భట్.. అతని రియాక్షన్ నెక్ట్స్ లెవల్..
Bigg Boss 5 Telugu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 19, 2021 | 5:48 PM

Bigg Boss 5 Telugu Grand Finale: బిగ్‌బాస్ ఐదోసీజన్ గ్రాండ్ ఫినాలే మరికాసేపట్లో అట్టహాసంగా ప్రారంభంకానుంది. బాలీవుడ్, టాలీవుడ్ అతిథులతో ఎన్నడూ లేనంతగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఈ సారి టైటిల్ విన్నర్ ఎవ్వరవుతారని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫినాలే.. ఎపిసోడ్ మరింత గ్రాండ్‌గా మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రణ్ బీర్ కపూర్, అలియా భట్‌ బిగ్‌బాస్ స్టేజ్ మీదకు రాబోతున్నారు. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం నాని, సాయి పల్లవి కూడా స్టేజ్ మీద సందడి చేయనున్నారు. దీంతోపాటు మాజీ కంటెస్టెంట్లు స్టేజ్ మీద డ్యాన్స్ పర్పామెన్స్‌తో రచ్చ చేయనున్నారు.

ఈ వేడుకలో భాగంగా.. హీరోయిన్ రష్మిక మందన ఏకంగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. సామి.. రా రా సామి అంటూ ఇంటి సభ్యులతో స్టెప్పులు కూడా వేయించినట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గత రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే.. ఫినాలే ఎలా ఉండబోతుందో.. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో అర్ధమవుతుంది.

వీడియో..

తాజాగా.. రిలీజ్ అయిన ప్రోమోలో అలియా భట్, రణబీర్ కపూర్ హల్చల్ చేశారు. తెలుగు ముద్దుముద్దుగా మాట్లాడిన రణబీర్.. మీ అందరికీ నా ముద్దులు అంటూ సందడి చేశాడు. ఇక.. అలియా భట్ ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పింది. దీంతో సన్నీ దెబ్బకు పడిపోయాడు. ఇక సాయి పల్లవి, నాని కూడా తమ స్టైల్లో ఎంటర్టైన్ చేసినట్లు అర్ధమవుతుంది.

రష్మిక బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి సందడి చేసింది. సిరిని బయటకు తీసుకొచ్చేందుకు వెళ్లినట్టు అనిపిస్తోంది. మౌనిక స్టేజ్ సామి పాటతో ఊపేస్తే.. హౌస్‌లో రష్మిక స్టెప్పులు వేస్తూ కనిపించింది. ఏదిఏమైనప్పటికీ.. బిగ్‌బాస్ విన్నర్ ఎవరు.. గ్రాండ్ ఫినాలే ఎలాంటి సందడి చేయనుందో.. మరికాసేపట్లో తెలియనుంది.

Also Read:

Bigg Boss 5 Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్‌కు అంతా రెడీ.. లాస్ట్‌లో సర్‌ప్రైజ్..!