Pushpa Movie: ఆ సీన్స్ తీసేయండి.. పుష్ప సినిమాపై ప్రేక్షకుల డిమాండ్.. చిత్ర బృందం ఏం చేసిందంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. పుష్పరాజ్ గా బన్నీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా డీ గ్లామర్ రోల్ చేసినా కుర్రకారుకు గిలిగింతలుపెట్టి పడగొట్టేసింది.

Pushpa Movie: ఆ సీన్స్ తీసేయండి.. పుష్ప సినిమాపై ప్రేక్షకుల డిమాండ్.. చిత్ర బృందం ఏం చేసిందంటే..
Pshpa Movie
KVD Varma

|

Dec 19, 2021 | 7:38 PM

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. పుష్పరాజ్ గా బన్నీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా డీ గ్లామర్ రోల్ చేసినా కుర్రకారుకు గిలిగింతలుపెట్టి పడగొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొత్తం మీద హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప జాతీయ స్థాయిలో మంచి సినిమాగా అందరినీ అలరిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే వార్తల్లో నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ చేస్తోంది. దీంతో పాటు ఈ సినిమా కంటెంట్‌పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇకపోతే సినిమాలో కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా ఒక సన్నివేశం పట్ల ప్రేక్షకుల్లో అసహనం వ్యక్తం అయింది. ఈ సన్నివేశాన్ని అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య చిత్రీకరించారు. ఈ సీన్ కొంత అసభ్యకరంగా ఉన్నట్టు ప్రేక్షకులు భావించడమే కాకుండా.. ఎబ్బెట్టుగా ఉన్న ఈ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించారంటూ నెటిజన్లు మండి పడ్డారు. సినిమాలో ఈ సీన్ అల్లు అర్జున్.. రాష్మిక మధ్య లవ్ సీన్ గా కనిపిస్తుంది. ఈ సన్నివేశంలో హీరో హీరోయిన్ల మధ్య రోమాన్స్ శృతి మించిందని ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో పుష్పరాజ్(అల్లు అర్జున్).. శ్రీవల్లి(రాష్మిక)పై చేయివేసిన సన్నివేశం కుటుంబ సమేతంగా చూసే విధంగా లేదని ప్రేక్షకుల ఫిర్యాదు. ఈ విషయంపై చిత్ర యూనిట్ వివరణ కూడా ఇచ్చింది.

చిత్ర యూనిట్ వివరణకు ప్రేక్షకులు.. నెటిజన్లు సంతృప్తి చెందలేదు. ఈ సినిమాలోని టిఫిన్ సీన్.. వ్యాన్ సీన్ తొలగించాలని సోషల్ మీడియాలో అందరూ కోరుతూ వస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరి మధ్య చిత్రీకరించిన బోల్డ్ సన్నివేశాలు లేకపోతే ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారని నెటిజన్లు సూచనలు చేస్తూ వస్తున్నారు. దీంతో మూవీ మేకర్స్ ప్రేక్షకుల సూచనలను మన్నించారు. అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. దీంతో సోమవారం నుంచి ఆ సన్నివేశాలు లేకుండా సినిమా ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ సన్నివేశాలు లేని కొత్త వెర్షన్ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తారు.

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా..

అడవిలో నివసించే ప్రజల సమస్యలు, గంధపు చెక్కల స్మగ్లింగ్ వంటి ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని కథ అల్లిన ఈ చిత్రంలో అడవి కథను చూపించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు మలయాళ సినీ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా నటించారు. పాన్ ఇండియా సినిమాగా ఇది డిసెంబర్ 17, 2021న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మనీష్ షా నిర్మించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి: Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..

Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu