HBD Ricky Ponting: 2003లో భారత అభిమానుల కన్నీటికి కారణమైన ఆసీస్ సారథి.. 3 ప్రపంచకప్‌లు అందించి చరిత్రలో నిలిచాడు..!
Ricky Ponting Birthday Special: టాస్మానియాకు చెందిన, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆసీస్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. నిజానికి కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఆటగాడిగా ఒక ప్రపంచకప్‌ను..

Happy Birthday Ricky Ponting: క్రికెట్ ప్రపంచాన్ని బ్యాట్‌తో శాసించిన చాలా మంది కెప్టెన్‌లను చూసే ఉన్నాం. అలాంటి వారిలో రికీ పాంటింగ్ కూడా ఒకరు. మైదానంలో తన ప్లాన్స్‌తో ఎన్నో మ్యాచులను గెలిపించి, ఆస్ట్రేలియాను జగజ్జేతను చేశాడు. ఈరోజు (డిసెంబర్ 19) పాంటింగ్ తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాస్మానియాకు చెందిన, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆసీస్ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. నిజానికి కెప్టెన్‌గా రెండు ప్రపంచకప్‌లు, ఆటగాడిగా ఒక ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఏకైక ఆటగాడు పాంటింగ్ కావడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్‌లో పాంటింగ్ ప్రయాణం ఫిబ్రవరి 1995లో మొదలైంది. జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మార్క్ టేలర్, మార్క్ వా వంటి వారి కెరీర్ సగం దశకు చేరుకోవడంతో ఈ యువ ప్లేయర్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే, జాతీయ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత అతని అత్యుత్తమ ప్రదర్శన వెలుగులోకి వచ్చింది. అతని మార్గదర్శకత్వంలో ఆసీస్ ఓడిపోలేదు. అలాగే ప్రత్యర్థి జట్లను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ టాలిస్మాన్ 324 గేమ్‌లలో 220 విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మారాడు. కెప్టెన్‌గా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన రికీ పాంటింగ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించేందుకు సిద్ధమయ్యాడు.
2003 ప్రపంచకప్ ఫైనల్‌లో పాంటింగ్ చేసిన ఈ అల్లకల్లోలాన్ని భారత అభిమానులు గుర్తుంచుకోవడానికి ఇష్టపడరు. జోహన్నెస్‌బర్గ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ అద్భుతమైన నాక్‌తో జట్టును 359 పరుగులకు నడిపించాడు. ప్రత్యుత్తరంగా భారత్ 234 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ మూడో ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
2003 పర్యటనలో మూడో టెస్టులో భారత్‌పై పాంటింగ్ స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా 336 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే, టాస్మానియా ఆటగాడు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. తన మారథాన్ నాక్‌తో 257 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 558 పరుగులు సాధించడంలో సహాయం చేశాడు. భారత్ పునరాగమనం చేయడంలో విఫలమైంది. దీంతో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మొదటి పురుషుల టీ20ఐ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 2005లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కొత్త ఫార్మాట్‌ను ఎలా అవలంబిస్తారో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. కొత్త వెర్షన్‌లోనూ పాంటింగ్ తన అడుగులు వేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అద్భుతమైన నాక్ ఆడాడు. ఆరంభం నుంచి బౌలర్లపై దాడి చేసి అజేయంగా 98 పరుగులు చేశాడు.సెంచరీని రెండు పరుగుల తేడాతో కోల్పోయాడు. అయితే ఆసీస్‌కు 44 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.
యాషెస్ 2006-07 మొదటి టెస్ట్‌లో, ఆసీస్ కెప్టెన్ తన సత్తాను మరోసారి చూపించాడు. చిరకాల ప్రత్యర్థులపై అద్భుతమైన నాక్ ఆడాడు. ఆండ్రీ ఫ్లింటాఫ్, జేమ్స్ ఆండర్సన్, మాథ్యూ హోగార్డ్ వంటి వారు పాంటింగ్‌ను ఆపలేకపోయారు. ఎందుకంటే అతను ఒక సంచలనాత్మక శతకం సాధించి ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్‌ను ముగించాడు. 277 పరుగుల విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియా 2006 టూర్ ఆఫ్ సౌతాఫ్రికాలో ఐదో వన్డేలో స్టార్ బ్యాట్స్‌మెన్ మ్యాచ్ 15వ ఓవర్‌లో బ్యాటింగ్‌లోకి వచ్చి ప్రోటీస్ బౌలర్లను చితక్కొట్టాడు. మెన్ ఇన్ ఎల్లో మొదటి ఇన్నింగ్స్‌లో 434 పరుగులు చేయడంతో తన అత్యధిక వన్డే స్కోరును కూడా నమోదు చేశాడు. అయినప్పటికీ, హెర్షెల్ గిబ్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా ఒక వికెట్ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
నవంబర్ 2012లో పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఒక గొప్ప శకం ముగిసింది. పదవీ విరమణ తర్వాత, లెజెండ్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో కొద్దికాలం పాటు అనేక ప్రముఖ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. అతను చాలా సందర్భాలలో వ్యాఖ్యాతగాను పనిచేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు తన సహాయ సహకారాలను అందిస్తున్నాడు.
? Happy birthday, @RickyPonting, happy birthday to you! ? pic.twitter.com/td0nRCng9Z
— cricket.com.au (@cricketcomau) December 18, 2021
? Over 27,000 international runs with 71 centuries ? Three Cricket World Cup titles ⭐ ICC Hall of Fame inductee
Happy birthday Ricky Ponting, one of the best to grace the game ? pic.twitter.com/HjPON58Q5N
— ICC (@ICC) December 18, 2021
Also Read: Virat Kohli vs BCCI: విరాట్ కోహ్లీ వైఖరిపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడంటే?