Virat Kohli vs BCCI: విరాట్ కోహ్లీ వైఖరిపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడంటే?

Indian Cricket Team: టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్దిరోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే.

Virat Kohli vs BCCI: విరాట్ కోహ్లీ వైఖరిపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడంటే?
Virat Kohli Vs Sourav Ganguly
Follow us

|

Updated on: Dec 18, 2021 | 9:09 PM

Virat Kohli vs BCCI: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, భారత క్రికెట్‌ జట్టు టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మధ్య పరస్పర విరుద్ధమైన ప్రకటనల కారణంగా వివాదం నెలకొంది. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటన తప్పు అని, కెప్టెన్సీ నుంచి వైదొలగకుండా తనను ఎవరూ ఆపలేదని టీమ్ కెప్టెన్ కోహ్లీ ఇటీవల విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ, విరాట్ కోహ్లీకి మధ్య తీవ్రవైన పోరు జరగుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే, సౌరవ్ గంగూలీ ఎటువంటి ప్రకటన ఇవ్వకుండా, బీసీసీఐతో చూసుకుంటుందని చెప్పాడు. కానీ, ప్రస్తుతం గంగూలీ కోహ్లీ వైఖరిపై పెద్ద ప్రకటన చేశాడు.

ఏబీపీ న్యూస్ నివేదిక ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ డిసెంబర్ 18 శనివారం ఒక కార్యక్రమంలో ఈ విషయం తెలిపాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోహ్లీ గురించి ఈ విషయం చెప్పాడు. విరాట్ కోహ్లీతో ఇటీవల జరిగిన ఘర్షణకు సంబంధించి గంగూలీ నేరుగా ఈ విషయాన్ని చెప్పకపోయినా.. హావభావాల్లో మాత్రం భారత మాజీ కెప్టెన్ కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు.

కోహ్లి ఆటిట్యూడ్ బాగుంది, కానీ.. నిజానికి ఈ కార్యక్రమంలో గంగూలీకి ఏ క్రికెటర్‌ యాటిట్యూడ్‌ బాగా నచ్చిందనే ప్రశ్నకు బదులిస్తూ.. విరాట్ కోహ్లి వైఖరి నాకు చాలా ఇష్టం. అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడు అని పేర్కొన్నాడు. జీవితంలో ఇంత ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు సరదాగా ఇలా అన్నాడు.. “జీవితంలో ఒత్తిడి లేదు. ఒత్తిడిని భార్య, స్నేహితురాళ్లు మాత్రమే ఇస్తారు” అని తెలిపారు.

అయితే, కోహ్లి విషయంపై స్పందించేందుకు బోర్డు ఇంకా సిద్ధంగా లేదు. డిసెంబర్ 15న కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా స్పందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. అయితే అది ఆగిపోయింది. కోహ్లీ సమాధానాలపై బోర్డులో చాలా అసంతృప్తి ఉందని, గంగూలీ స్వయంగా చాలా కోపంగా ఉన్నాడని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, టీమ్ ఇండియా ముఖ్యమైన దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఈ వివాదాన్ని కొనసాగించడానికి బీసీసీఐ ఇష్టపడడం లేదు. అందువల్ల ఈ విషయంలో బోర్డు ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా పత్రికా ప్రకటనను జారీ చేయదని గంగూలీ పేర్కొన్నాడు.

Also Read: Ashes 2021: పింక్ బాల్‌తో మ్యాజిక్ చేసిన ఆసీస్ స్టార్ బౌలర్.. మరే ఇతర బౌలర్‌కూ సాధ్యం కాలే.. ఆ రికార్డులేంటంటే?

Watch Video: ద్రవిడ్ వర్సెస్ విరాట్ కోహ్లీ.. గెలుపెవరిదో తెలుసా? వీడియో..

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..