AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలా? అయితే, ప్రతీ రోజూ ఈ పప్పు దినుసులను తినాల్సిందే..!

Health Tips: పప్పు దినుసుల్లో చాలా రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ కొత్త పప్పులను మీ ఫుడ్‌లో చేర్చుకోవచ్చు. పప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా

Health Tips: సంపూర్ణ ఆరోగ్యం కావాలా? అయితే, ప్రతీ రోజూ ఈ పప్పు దినుసులను తినాల్సిందే..!
Shiva Prajapati
|

Updated on: Dec 19, 2021 | 9:03 PM

Share

Health Tips: పప్పు దినుసుల్లో చాలా రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ కొత్త పప్పులను మీ ఫుడ్‌లో చేర్చుకోవచ్చు. పప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి పప్పుదినుసులు చాలా మేలు చేస్తాయి. పప్పు దినుసులను భారతీయులు తమ వంటకాల్లో ప్రధానంగా వినియోగిస్తుంటారు. అన్నం, రోటీ, సాంబార్‌లో పప్పును విరివిగా వినియోగిస్తారు. అయితే పప్పులో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతీ రోజూ కొత్త కొత్త పప్పు దినుసులతో వంటకాలు చేసుకుని ఆరగించవచ్చు. పప్పులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల చాలా కాలం పాటు నిండుగా ఉంచుతాయి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే పప్పులు ఏవో తెలుసుకుందాం.

మినప్పప్పు.. సాధారణంగా ఈ పప్పును.. పప్పులకు తల్లిగా పేర్కొంటారు. ఇందులో ప్రోటీన్స్, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొవ్వు పదార్థాలు, కేలరీలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ పప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శక్తిని పెంచుతుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అరకప్పు మినప్పప్పులో 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

శనగపప్పు.. ప్రొటీన్, పీచుతో కూడిన శనగలు.. మీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఒక కప్పు శనగ పప్పులో శరీరానికి తగినంత ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటుంది. శనగ పప్పు గుండె సంబంధిత ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. ఇది మీ రక్తపోటును నియంత్రించణలో ఉంచుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అర కప్పు శనగల్లో 9 గ్రాముల వరకు ప్రొటీన్స్ ఉంటాయి.

మసూర్ పప్పు(ఎర్ర పప్పు).. మన తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర పప్పు, మైసూర్ పప్పు అని పిలుస్తారు. ఈ పప్పును ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. ఈ పప్పులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సి, బి6, బి2, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. అర కప్పు మసూర్ పప్పు 9 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.

కంది పప్పు.. ఖిచ్డీ తయారీకి ఉపయోగించే మరొక ప్రధాన పప్పు కంది పప్పు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కంది పప్పులో ఎక్కువగా వంటకాలు చేస్తుంటారు. సాంబార్, ఇతర పప్పు వంటకాలు చేస్తుంటారు. ఈ పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు, గుండె జబ్బులకు ఈ పప్పు చాలా మేలు చేస్తుంది. 100 గ్రాముల పప్పులో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Also read:

Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..

Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..