AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?

Lakshmi Manchu Injured Pics: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ప్రశంసలతోపాటు..

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?
Lakshmi Manchu
Shaik Madar Saheb
|

Updated on: Dec 19, 2021 | 8:35 PM

Share

Lakshmi Manchu Injured Pics: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ప్రశంసలతోపాటు.. ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె అనుకున్న దాన్ని ఆచరిస్తూ ముందుకుసాగుతుంటుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎప్పుడు కూడా ఏదోఒక పనితో సందడి చేస్తూ బిజీబిజీగా ఉంటుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి.. స్టార్ హీరో మోహన్ లాల్‌తో కలిసి ఓ మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే.. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి వేళ్లకి, మోకాలికి గాయాలైన వీడియోలను పోస్ట్ చేసింది. దీంతో మంచు అభిమానులంతా షాకయ్యారు. మంచు లక్ష్మికి ఏదో ప్రమాదం జరిగిందని.. దీంతో గాయాలయ్యాయంటూ నెటిజన్లు కంగారుపడ్డారు. దీంతోపాటు పలు వార్తలు కూడా ప్రసారమయ్యాయి.

దీంతో మంచు లక్ష్మి దీనిపై స్పందించి.. అసలు విషయాన్ని వెల్లడించింది. ఆ గాయాలు ప్రమాదం వలన జరిగిందని కాదంటూ వెల్లడించింది. సినిమా కోసం వేసిన మేకప్ చిత్రాలంటూ క్లారిటీ ఇచ్చింది. మలయాళం సినిమా షూటింగ్‌లో ఓ సీన్ కోసం చేసుకున్న మేకప్ చిత్రాలని.. తనకెలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. షేర్ చేసిన ఫొటోలు కేవలం సినిమాకు సంబంధించినవని.. తనకెలాంటి ప్రమాదం జరగలేదన్నారు. తనపై ఇంత ప్రేమ, అభిమానం చూపిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు.

అయితే.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. షూటింగ్ కోసం చేసుకున్న మేకప్ అయినప్పుడు.. నిజమైన ఫొటోల్లా పోస్ట్ చేసి నొప్పి నటించడం ఎందుకంటూ కొందరు విమర్శిస్తున్నారు.

Also Read:

Bigg Boss Telugu 5 Finale: సన్నీకి ఐలవ్యూ చెప్పిన అలియా భట్.. అతని రియాక్షన్ నెక్ట్స్ లెవల్..

Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Follow Us
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
ఇక కేవలం 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం..ఈ బ్యాంకు కొత్త పోర్టల్
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
బంగ్లాదేశ్ ప్రధాని కుమార్తెపై దాడి..?
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
అందుకే కష్టపడి ఎక్కువ సినిమాలు చేస్తున్నా..
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుబడుతున్న పలు రాజకీయ పక్షాలు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
మీ బ్యాంకు అకౌంట్‌లో జీరో ఉన్నా రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఈ సమస్యలన్నీ పరార్.. కివి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
రాత్రిపూట మిగిలిన చికెన్ పిల్లలకి వేడి చేసి పెడుతున్నారా?
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
ఒక్కమ్యాచ్ కూడా గెలవలేదు కానీ..వరల్డ్ రికార్డు మాత్రం కొట్టేసింది
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?
విదేశీ ఆపిల్స్ తింటే మంచిదా.. స్వదేశీనా..? వైద్య నిపుణుల మాటేంటి?