Health Tips: ఈ రెండు పానీయాలు తీసుకుంటే వృద్ధాప్య సమస్యలకు చెక్.. పరిశోధన ద్వారా తేల్చిన పరిశోధకులు..!
Health Tips: వయసు మీదపడుతున్నకొద్ది వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. అంతేకాకుండా ఎముకలు, కండరాల పటుత్వ అనేది కోల్పోవడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి...

Health Tips: వయసు మీదపడుతున్నకొద్ది వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. అంతేకాకుండా ఎముకలు, కండరాల పటుత్వ అనేది కోల్పోవడంతో అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. ఇప్పుడున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. వయసు పెరిగేకొద్ది దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వయో సంబంధిత సమస్యల నుంచి గట్టెక్కేందుకు మెరుగైన ఆరోగ్యానికి కాఫీ, కొకొవా పానీయాలు ఔషధంగా ఉపయోగడపతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ తాజా అధ్యయనం ద్వారా వెల్లడించింది. అయితే 12 సంవత్సరాల పాటు 842 మందిపై న్యూరో సైకలాజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత శాస్త్రవేత్తలు వివరాలను వెల్లడించారు.
మెదడు పని తీరు మెరుగుపడుతుంది..
కాఫీ, కొకొవా పానీయాలు ప్రతి రోజు తీసుకున్నట్లయితే మెదడు పనితీరు మరింతగా మెరుగు పడుతుందని పరిశోధకులు తెలిపారు. వేడివేడి కాఫీ లేదా కొకొవా తీసుకోవడం వల్ల మెదడు మరింతగా చురుకుదనంగా తయారవుతుందంటున్నారు. అంతేకాకుండా మతిమరుపు సమస్య ఉన్న వారికి ఈ పానీయాలు ఔషధంగా పని చేస్తాయని స్పష్టం చేస్తున్నారు.
పాలీపెనాల్‌తో మెదడు ఆరోగ్యం:
పాలీపెనాల్ పుష్కలంగా ఉండే ఆహారంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుందని, కాఫీ, కొకొవా, పుట్ట గొడుగులు, రెడ్‌వైన్‌లో పాలీపెనాల్ అధిక స్థాయిలో ఉంటుందని, దీని వల్ల వయో భారంతో తలెత్తిన సమస్యలను పాలీపెనాల్ అధికంగా ఉండే ఆహారం నియంత్రిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే కాఫీ, కొకొవాతో కిడ్నీల పనితీరు, గుండె, లీవర్ పనితీరుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి: