Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులతో ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!

Health Benefits: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఆస్పత్రుల చుట్టు తిరగకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే..

Health Benefits: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులతో ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 19, 2021 | 8:47 PM

Health Benefits: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా ఆస్పత్రుల చుట్టు తిరగకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకునే విధంగా చేసుకోవచ్చు. వంటింట్లో దొరికి వాటితోనే మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. తినే ఆహారంలో వంటగదిలో దొరికే కొన్నింటిని కొన్నింటిని భాగం చేసుకోవడం వల్ల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చుంటున్నారు.

Black Pepper

మిరియాలు:

ప్రతి ఒక్కరి వంటింటి మిరియాలు ఉంటాయి. మిరియాల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో యాంటి ఇక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్‌, విటమిన్‌ ఏ, సీలు పుష్కలంగా ఉంటాయి. అరుగుదలను మెరుగు పరుస్తుంది. ఘాటైన వాసనను కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగిస్తాయి. గ్రాము మిరియాలు తీసుకుని వేయించి పొడి చేసి, చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమాన్ని, గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ రెండు, మూడు సార్లు చొప్పున తీసుకోవాలి. ఇది జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దూరం చెస్తుంది.

Coriander కొత్తమీర:

కొత్తమీర కూడా ప్రతి వంటల్లో వినియోగించుకునేది. మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి ఈ కొత్తిమీరను మర్చిపోరు. దీనిలో ఫైబర్‌, విటమిన్‌ కె, ఏ, క్యాల్షియం సమృద్దిగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్రను మెరుగు పర్చేలా చేస్తుంది. అంతేకాకుండా మహిళల రుతుచక్రం సవ్యంగా సాగేలా దోహదపడుతుంది. ఇంకా కడుపు నొప్పి, ఉబ్బసం, ఎలర్జీ లాంటి బాధలు ఉండవు. నోటి పూత,నోటి దుర్వాసన, దంతాలు పుచ్చటం అనే వాటికి ధనియాలు బాగా నములుతూ ఉంటే పై లక్షనాలన్నిటికి చెక్ పెట్టవచ్చు. ఎండిపోయినట్లుగా ఉన్న ముఖ చర్మం మృదువుగా మారేందుకు ఉపయోగపడుతుంది.

Spearmint

పుదీనా:

పుదీనా వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతి వంటింటి ఉపయోగించేదే. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దగ్గును సైతం నివారిస్తుంది. పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనాలో ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Holy Basil

తులసి:

తులసీ.. భారతీయ సంప్రదాయంలో పూజలందుకుంటుంది తులసి చెట్టు. తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తులసి రోగనిరధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది. తులసి వాతం, క్యాన్సర్‌, ఒత్తిడితో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారికి తులసి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

Broccoli

బ్రకోలి:

ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ బ్రకోలి ఆకుకూర గర్బిణులకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది వారికి ఫోలిక్‌ అమ్లానికి గని లాంటిది. ఇందులో విటమిన్‌ సి, ఏ,ఈ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఈ బ్రకోలి శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌ నుంచి కాపాడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, పేగుల్లో మంటగా అనిపిస్తే బ్రకోలిని మితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

Curry Tree

కరివేపాకు:

వంటింటో ఉండే కరివేపాకు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో విటమిన్‌ ఏ, బీ,సీ, ఈ ఉంటాయి. పిండిపదార్థాలు, భాస్వరం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫోలిక్‌ ఆమ్లం రక్తహీనతతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది. కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.