Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care Tips: మీరు టీ తాగుతున్నప్పుడు వీటిని అస్సలు తినకండి..ఎందుకంటే..

మీరు చాయ్ తాగుతున్నప్పుడు స్నాక్స్ చాలా ఇష్టంగా తింటున్నారా.. అయితే అందులో ఇవి మాత్రం లేకుండా చూసుకోండి.

Health Care Tips: మీరు టీ తాగుతున్నప్పుడు వీటిని అస్సలు తినకండి..ఎందుకంటే..
Health Care
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 19, 2021 | 8:58 PM

టీతో తమ దిన చర్యలను మొదలు పెడుతారు చాలామంది. కొందరికి టీ తాగే అలవాటు ఎంతలా ఉంటుందంటే.. టీ తాగకపోతే తలనొప్పి వచ్చేంతలా.. టీ తాగడం వల్ల అలసట తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే టీ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని చాలామంది నమ్ముతారు. టీలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయని నమ్ముతారు. అయితే ఇలాంటి నమ్మకాలకు కొంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ మధ్య పరిశోధనల్లో వెలుగు చూసింది. టీ తో స్నాక్స్ తీసుకుంటే చాలా ఆనందంగా.. రుచిగా ఉంటాయి. ఉదయం లేదా సాయంత్రం టీతో పాటు స్నాక్స్ తీసుకోవడం చాలా మందికి అలవాటు. అంతేకాదు చిరుతిండిగా టీతో ప్రతిదాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా.. ఈ రోజు మనం టీతో దూరంగా ఉండవలసిన వాటి గురించి మీకు తెలియజేస్తాము.

పసుపు

మీకు టీ తాగడం అంటే ఇష్టమైతే పసుపును ఎక్కువగా వాడే వాటిని తినకుండా ఉండండి. పసుపు , టీ రసాయన మూలకాలలో రసాయన ప్రతిచర్య ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

పుల్లనివి..

పుల్లటి పదార్థాలు టీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. అనారోగ్యంతో రోజును ప్రారంభించడం ఎవరికి ఇష్టంగా ఉంటుంది చెప్పండి. మీరు స్నాక్స్ తీసుకుంటే నిమ్మకాయ లేదా ఇతర పుల్లని వాటిని దూరంగా ఉండండి.

మొలకెత్తిన ధాన్యాలు

మొలకెత్తిన ధాన్యాలు లేదా సలాడ్లను అల్పాహారంగా తిన్న తర్వాత కొందరు టీ తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల కడుపులోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇలా చేయడం మానుకోండి.

శీతల పానీయములు

టీ తాగిన వెంటనే చల్లటి నీరు తాగడం చాలా హానికరం. అంతే కాదు టీ తాగిన తర్వాత ఐస్ క్రీం తినకూడదు. టీ తాగిన గంట తర్వాత మీరు కావాలంటే మీరు చల్లటి పదార్థాలు తినవచ్చు.

ఉడికించిన గుడ్డు

ఉడకబెట్టిన గుడ్లను టీతో పాటు తినకూడదని చాలా తక్కువ మందికి తెలుసు. గుడ్డు ప్రోటీన్ మంచి మూలంగా పరిగణించబడుతున్నప్పటికీ టీతో అది మీకు హానికరం అని తెలుసకోండి.

ఇవి కూడా చదవండి: Amazing Video: ఈ యువకుడికి ప్రపంచం సెల్యూట్ చేస్తోంది.. ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో..

Gang War: కోతులు-కుక్కల గ్యాంగ్‌వార్‌కు బ్రేక్.. వానర నాయకుల బందీ..