Gang War: కోతులు-కుక్కల గ్యాంగ్‌వార్‌కు బ్రేక్.. వానర నాయకుల బందీ..

కోతులు-కుక్కల గ్యాంగ్‌వార్‌ షాక్‌ నుంచి మహారాష్ట్ర లోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ గ్రామస్తులు తేరుకోలేకపోతున్నారు. 250 కుక్కపిల్లలను మట్టుబెట్టిన రెండు కొండముచ్చులను నాగ్‌పూర్‌ అటవీశాఖ..

Gang War: కోతులు-కుక్కల గ్యాంగ్‌వార్‌కు బ్రేక్.. వానర నాయకుల బందీ..
Monkeys
Follow us

|

Updated on: Dec 19, 2021 | 7:05 PM

Gang War: కోతులు-కుక్కల గ్యాంగ్‌వార్‌ షాక్‌ నుంచి మహారాష్ట్ర లోని బీడ్‌ జిల్లా మజల్‌గావ్‌ గ్రామస్తులు తేరుకోలేకపోతున్నారు. 250 కుక్కపిల్లలను మట్టుబెట్టిన రెండు కొండముచ్చులను నాగ్‌పూర్‌ అటవీశాఖ సిబ్బంది శనివారం అతికష్టం మీద బంధించారు. అయినప్పటికి పిల్లలను స్కూళ్లకు పంపించడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. తమ గ్రామంలో ఒక్క కుక్క పిల్ల కూడా మిగల్లేదని , అయినప్పటికి కోతుల భయం తమ పిల్లలను వెంటాడుతోందని చెబుతున్నారు. అయితే మిగతా కోతులను కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. మజల్‌గావ్‌లో కుక్కపిల్లలను చంపిన కోతులు తాజాగా స్కూల్‌కు వెళ్తున్న చిన్నారులను కూడా టార్గెట్‌ చేయడం మొదలుపెట్టాయి. నాగ్‌పూర్‌ అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కోతులను బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

త‌మ కోతి పిల్ల‌ను కుక్క‌లు చంపేశాయ‌ని ప‌గ‌తో ర‌గిలిపోయిన కోతులు కుక్క‌ల‌ను వెంటాడి మరీ చంపేశాయి. కుక్క పిల్ల‌ల‌ను ప‌ట్టుకొని వాటిని చెట్ల మీదికి, బిల్డింగ్స్ మీదికి తీసుకెళ్లి అక్క‌డి నుంచి వ‌దిలేసి కిరాత‌కంగా 250 కుక్క‌ల‌ను కోతులు మ‌ట్టుపెట్టాయి. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. మాజ‌ల్‌గావ్ అనే గ్రామంలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కోతులు చేస్తున్న దారుణాన్ని చూసిన గ్రామ‌స్తులు వెంట‌నే అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. వాళ్లు వ‌చ్చి కోతుల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు.

ఊళ్లో ఉన్న కుక్క పిల్ల‌ల‌ను అన్నింటినీ చంపేసిన కోతులు.. త‌ర్వాత ఊళ్లోని పిల్ల‌ల‌పై విరుచుకుప‌డ‌టం ప్రారంభించాయి. చివ‌ర‌కు కుక్క‌ల‌ను చంపిన కోతుల్లో రెండు కోతుల‌ను అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి: AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

Brown Rice Benefits: డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ఎందుకు తినాలో తెలుసా.. సరికొత్త పరిశోధనల్లో తేలింది ఇదే..