AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

సినిమా టికెట్ రేట్లపై ఇంకా వివాదం తేల్లేదు. అంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్‌ కోసం జీవో 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్స్ విక్రయాలు మొత్తం ప్రభుత్వం ఆధీనంలో..

AP Movie Tickets: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్ల కోసం జీవో 142 జారీ.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..
Movie Tickets Online
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: Dec 19, 2021 | 6:51 PM

సినిమా టికెట్ రేట్లపై ఇంకా వివాదం తేల్లేదు. అంతలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్‌ కోసం జీవో 142 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సినిమా టికెట్స్ విక్రయాలు మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. ఏ సినిమా టికెట్స్ అయినా ప్రభుత్వం ద్వారానే అమ్మకాలు జరుగుతాయి. ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్ విక్రయించే బాధ్యతను APFCకి అప్పగించింది ప్రభుత్వం. త్వరలోనే ఈ ఆన్‌లైన్‌ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సినిమా టికెట్స్ విక్రయాల కోసం ఐఆర్‌సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది సర్కార్.

ఇదిలావుంటే.. సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తూ ఏప్రిల్‌ 8న ప్రభుత్వం జీవో నెంబర్‌35ను జారీ చేసింది. ప్రాంతాల వారీగా టికెట్ల రేట్లు ఎంత ఉండాలో నిర్దేశించింది.. ఈ జోవోని సవాల్ చేస్తూ థియేటర్ల యజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి బెంచ్‌ జీవో 35కు ముందు అనుసరించిన విధానంలోనే టికెట్‌ ధరలను నిర్ణయించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు కల్పించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేసింది ప్రభుత్వం. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ M. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచడం వల్ల సామాన్యుడిపై భారం పడుతోందని ప్రభుత్వం తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. మూవీ బిజినెస్‌లో ప్రభుత్వ జోక్యం సరికాదని థియేటర్ యాజమాన్యాలు వాదిస్తున్నాయి. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. థియేటర్ యాజమాన్యాలు పెంపు ప్రతిపాదనల్ని JC ముందు ఉంచాలని చెప్పింది. టికెట్‌ ధరలపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అన్ని థియేటర్లలో మెయింటెనెన్స్ ఒకేలా ఉండదని..అందుకే చిన్న సినిమా, పెద్ద సినిమాను ఒకేలా చూడొద్దన్నది పిటిషనర్ల వాదన. అలాగే అదనపు షోలు వేసుకునే వెసులుబాటు కల్పించాలి కోరుతున్నాయి. మూవీ బడ్జెట్‌ను బట్టి రేట్లు పెంచుతామనడం సరికాదంటోంది సర్కారు. ఆన్‌లైన్ విధానంతో బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పడుతుందని.. పన్ను ఎగవేసేవారి సంఖ్యను తగ్గించొచ్చని చెబుతోంది. అయతే తాజా జీవీ142పై చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: Bigg Boss 5 Telugu Grand Finale Live: గ్రాండ్‌గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్.. స్టేజ్ పై సందడే.. సందడే

Pushpa in OTT: పుష్ప రెండు ఓటీటీల్లో విడుదల.. డిజిటల్‌లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..

Pushpa Vs KGF: ‘పుష్ప హిందీ’ వెర్షన్‌కు షాకింగ్ కలెక్షన్లు.. ఫస్ట్ డే యష్ కేజీఎఫ్‌ని బీట్ చేసిన బన్నీ..