Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa in OTT: పుష్ప రెండు ఓటీటీల్లో విడుదల.. డిజిటల్‌లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..

Pushpa in OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. బన్నీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగానే..

Pushpa in OTT: పుష్ప రెండు ఓటీటీల్లో విడుదల.. డిజిటల్‌లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..
Pushpa Ott
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2021 | 8:58 AM

Pushpa in OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. బన్నీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగానే ఆ అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ అంచనాలను నిజం చేస్తూ.. బన్నీ.. పుష్ప..పుష్ప రాజ్ అంటూ ఒన్ మాన్ ఆర్మ్ షో తో బాక్సాఫీస్ వద్ద కాసుల వేట మొదలు పెట్టాడు. డీ గ్లామర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి అలరించాడు. బన్నీతో  కన్నడ సోయగం రష్మిక మందన్న జతకట్టింది. సమంత స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ సినిమా త్వరలో డిజిటల్ లో రిలీజ్ కానున్నది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పుష్ప సినిమా ఓటిటి హక్కులను ఇప్పటికే ఓటిటీ సొంతం చేసుకుంది.

అయితే పుష్ప మూవీ తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో ప్రసారమవుతుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం పుష్ప అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే డిజిటల్ లో ప్రసారం అయ్యే డేట్స్ ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ చిత్రం OTTలో జనవరి 2022 మధ్యలో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని పాత్రలో పుష్ప లో కనిపించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం హిల్స్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్  నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించాడు.

తొలిసారిగా బన్నీ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. తెలుగు తో పాటు, తమిళ, కన్నడ,  విడుదలైంది. మాలయంలో రిలీజ్ కావాల్సి ఉంది.  పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అనసూయ ముఖ్య పాత్రల్లో నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పుష్ప మొదటి భాగం 2021లో రిలీజ్ కాగా  రెండవది 2022లో విడుదల కానున్నది.

Also Read:  నేడు తిరుప్పావైలో నాల్గోపాశురం.. మ౦చిని వర్షంలా కురిపించు అని కృష్ణుడిని గోపికలతో కలిసి వేడుకున్న గోదాదేవి