Dhanurmasa: నేడు తిరుప్పావైలో నాల్గోపాశురం.. మ౦చిని వర్షంలా కురిపించు అని కృష్ణుడిని గోపికలతో కలిసి వేడుకున్న గోదాదేవి
Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు నాలుగోరోజు.. ఈ నెల రోజులూ ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను పాడతారు. ధనుర్మాసం ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై ,..
Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు నాలుగోరోజు.. ఈ నెల రోజులూ ప్రతి దినం గోదాదేవి రచించిన పాశురాలను పాడతారు. ధనుర్మాసం ఈ నెల రోజులూ జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై , గోదాకళ్యాణం ఇవి ద్రవిడ సంప్రదాయాలు. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాల కథనం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులూ వివాహితులు తిరుప్పావై పఠించడం వలన కొరికిన కోర్కెలు తీరతాయని నమ్మకం. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్.. ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. విష్ణువుని కొలిచి రంగనాథుడినే భర్తగా పొందింది. కనుక ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావైలోని పాశురాలను రోజుకొకటి చొప్పున పఠిస్తూ శ్రీమహావిష్ణువుని కొలిచిన వారికీ కొంగుబంగారమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ధనుర్మాసంలో నాలుగోరోజు.. నాలుగవ పాశురము, దాని అర్ధం తెలుసుకుందాం..
నాలుగవ పాశురము
ఆళి మళై కణ్ణా ఒన్ఱు నీ కైకరవేల్ ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి ఊళి ముధల్వ నురువమ్బోల్ మెయికఱుత్తు పాళియందోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ అళి పోల్ మిన్ని, వలమ్బురిపోల్ నిన్ఱదిర్ న్దు తాళాదే శార్౦గ ముదైత్త శరములైపోల్ వాళ ఉలగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావాయ్
అర్ధం:
పెద్ద పెద్ద వర్షాలని కురిపి౦చగలిగిన ఓ వరుణుడా! నీ గొప్పతనాన్ని ఏమాత్రము తగ్గనీయకు. సముద్రములో ఉన్న నీర౦తా త్రాగు. గర్జి౦చి మీదకు పోయి నీ శరీరాన్ని శ్రీమన్నారాయాణమూర్తి శరీర౦ లాగా నల్లగా చేసుకో నీ ను౦చి వచ్చే మెరుపులు ఆ భగవ౦తుని కుడి చేతియ౦దు౦డు చక్రములాగా మెరవాలి. నీ ఉరుములు ఆయన ఎడమ చేతియ౦దు ఉన్న శ౦ఖములాగా గర్జి౦చునట్లు ఉ౦డాలి. నువ్వు కురిపి౦చే వర్షధారలు ఆయన చేతి య౦దు ఉన్న విల్లు ను౦చి కురిసిన బాణములవలె ఉ౦డాలి. నువ్వు కురిపి౦చిన వర్షము వలన లోకములో అ౦దరూ సుఖముగా ఉ౦డాలి. మేమ౦దరము స౦తోషముగా స్నానము చేయటానికి సరిపడునట్లు మ౦చి వర్షాన్ని కురిపి౦చు అని గోదాదేవి గోపికలతో కలసి వరుణుడిని కోరుతున్నారు.
Also Read: ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత.. నేడు, రేపు శీతలగాలులు వీచే అవకాశం.. పడిపోయిన ఉష్ణోగ్రత..