Delhi Weather: ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత.. నేడు, రేపు శీతలగాలులు వీచే అవకాశం.. పడిపోయిన ఉష్ణోగ్రత
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో చలి పులి పంజా విసురుతోంది. హస్తినలో కురుస్తున్న హిమపాతంతో చలితీవ్రత అధికమైంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 17.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే సమయంలో..
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీలో చలి పులి పంజా విసురుతోంది. హస్తినలో కురుస్తున్న హిమపాతంతో చలితీవ్రత అధికమైంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 17.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నిరంతరం కురుస్తున్న హిమపాతం కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రమైంది. అంతేకాదు రాబోయే కొద్ది రోజులపాటు ఢిల్లీలో చలి గాలులు వీస్తాయని అంచనా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అదే సమయంలో గాలి వేగం పెరగడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) స్వల్పంగా మెరుగుపడిందని తెలిపింది. పర్వతాలపై మంచు కురిసిన తర్వాత గాలి కారణంగా చలి పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది
నేడు, రేపు ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని.. ఉదయం పొగమంచుతో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం వివిధ ప్రాంతాల్లో అత్యల్ప గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే సమయంలో.. లోధి రోడ్, రిడ్జ్ ఏరియా , ఆయనగర్‌లలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. డిసెంబర్సెం 20వ తేదీ తర్వాత గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణం అంటే 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుందని భావిస్తున్నప్పటికీ. అదే సమయంలో డిసెంబర్ 20న 19 డిగ్రీలు, డిసెంబర్ 23, 24 తేదీల్లో 23 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఈ రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణంగా 9 డిగ్రీల సెల్సియస్ … డిసెంబర్ 20 మరియు 21 తేదీలలో వరుసగా 5 మరియు 6 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీలో డిసెంబర్‌లో గత రికార్డ్స్ ను బద్దలు కొట్టేలా శీతలగాలులు వీస్తాయని.. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అంటే 3 నెలల పాటు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశం మొత్తంలో తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో, గత కొన్ని సంవత్సరాలుగా చలి , కనిష్ట ఉష్ణోగ్రతల రికార్డులు కూడా బద్దలు అయ్యే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Also Read: నేడు ఈరాశివారికి అన్నింటా విజయమే… ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..