Horoscope Today: నేడు ఈరాశివారికి అన్నింటా విజయమే… ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (19-12-2021):  వృత్తి, విద్య, వ్యాపారం ఇలా ఎవరైనా సరే ఇప్పటికీ రోజులో ఏమైనా కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ..

Horoscope Today: నేడు ఈరాశివారికి అన్నింటా విజయమే... ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2021 | 7:19 AM

Horoscope Today (19-12-2021):  వృత్తి, విద్య, వ్యాపారం ఇలా ఎవరైనా సరే ఇప్పటికీ రోజులో ఏమైనా కొత్తపనులు ప్రారంభించాలన్నా.. ప్రయాణం చేయాలన్నా శుభకార్యాల విషయంలోనూ ఇలా అనేక విషయాలపై మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 19వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తారు. శుభవార్త వింటారు. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. సంతోషముగా గడుపుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు స్థిరాస్తికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను విజయంవంతంగా పూర్తి చేస్తారు.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన అనేక సమస్యలనుంచి బయటపడే అవకాశం ఉంది.  మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది.  అనారోగ్య బాధలు అధికమవుతాయి.  కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలు అధికంగా చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో భయాందోళనకు గురవుతారు.   చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. మానసిక ఆందోళన తొలగుతుంది.  విదేశయాన ప్రయత్నాల్లో కొంత జాప్యం నెలకొంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు ఆవేశానికి దూరంగా ఉండాలి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు అధిగమవుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబంలో కలహాలు తొలగి సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభంతో సంతోషంగా ఉంటారు. స్త్రీవలన ధనలాభం పొందుతారు. రుణబాధలు తొలగి సంతోషముగా ఉంటారు.  కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది.  ఆరోగ్యం మెరుగవుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. వృధా ప్రయాణాలను అధికంగా చేస్తారు. స్త్రీవలన ధనలాభం కలుగుతుంది. అనుకోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశి క్రీడా, రాజకీయ రంగాల్లోని వారికీ మంచి అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు.  వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

Also Read:  స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే