sukesh chandrashekhar: జైలు అధికారులకు నెలకు రూ. కోటి లంచం.. తవ్వేకొద్ది బయటపడుతోన్న సుఖేష్ మోసాలు..
sukesh chandrashekhar: రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో..
sukesh chandrashekhar: రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నా కొద్దీ సుఖేష్ ఆర్థిక నేరాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. సుఖేష్ ప్రముఖుల పేర్లను ఉపయోగించుకొని చాలా మంది సినీ తారలను వలలో వేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తులో పలు షాకింగ్ విషయాలు వెల్లడైనట్లు కథనాలు వస్తున్నాయి.
సుఖేశ్‌ను జైల్లో కలవడానికి కనీసం 12 మంది నటీమణులు, మోడల్స్ వచ్చి వెళ్లారని అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే తనను కలవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడానికి, జైల్లో తనకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సుఖేష్.. జైలు అధికారులకు నెలకు కోటి రూపాయలు లంచంగా ఇచ్చాడని దర్యాప్తులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా జైల్లో ఫోన్‌ను ఉపయోగించుకోవడానికే సుఖేస్ రూ. 60 లక్షలకుపైగా లంచం ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.
జైల్లో ఉన్న సుఖేష్‌ను కలవడానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వచ్చేవారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సుఖేష్ మాత్రం జైల్లో తనను అధికారులు వేధిస్తున్నారంటూ పై అధికారులకు లేఖ రాశాడు. మానసికంగా కుంగిపోతున్నట్లు, తన భార్యను కేవలం రెండు వారాలకొకసారి మాత్రమే కలిసే అవకాశం ఇస్తున్నారని సుఖేష్ ఆరోపిస్తున్నాడు. మరి సుఖేష్ కథ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Omicron Variant: ఒమిక్రాన్ టెన్షన్.. భారత్‌లో కొత్తగా మరో 8 కొత్త వేరియంట్ కేసులు.. ఎక్కడంటే..!
Health Tips: ఆహారం తిన్న తరువాత ఈ రెండు పనులు చేస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.. అవేంటంటే..!
AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు