Amritsar: గోల్డెన్ టెంపుల్‌లోకి దూసుకెళ్లాడు.. తల్వార్ తీసుకున్నాడు.. తర్వాత ఏమైదంటే..
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని శనివారం కొట్టి చంపారు...
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని శనివారం కొట్టి చంపారు. ” శనివారం 24 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తి పగోల్డెన్ టెంపుల్ లోపలికి దూసుకుపోయాడు. అక్కడ పూజలో ఉంచిన తల్వార్‌ను తియడానికి ప్రయత్నించాడు. అక్కడున్న వారు వెంటనే అతడిని బయటకు లాగి కొట్టారు. దీంతో అతడు మరణించాడు. మృతదేహాన్ని సివిల్ ఆస్పత్రికి తరలించామని డీసీపీ పర్మీందర్ సింగ్ భండాల్ తెలిపారు. ఆ వ్యక్తి గర్భగుడి లోపల గోల్డెన్ గ్రిల్స్ దూకి తల్వార్ తీసుకుని, ఒక సిక్కు పూజారి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ పఠిస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అతన్ని వెంటనే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు పట్టుకున్నారు.
అతన్ని SGPC కార్యాలయానికి తీసుకెళ్తున్నప్పుడు, కోపంతో ఉన్న అక్కడి వారు తీవ్రంగా కొట్టారు. మృతుడు యూపీకి చెందిన వ్యక్తి భండాల్ తెలిపారు. అతను స్వర్ణ దేవాలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు. అతనితో పాటు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. సంఘటన తర్వాత, పెద్ద సంఖ్యలో సిక్కు భక్తులు, వివిధ సిక్కు సంస్థలు SGPC దాని నిర్లక్ష్యంపై మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తేజా సింగ్ సముంద్రి హాల్‌లోని ఎస్‌జీపీసీ కాంప్లెక్స్ చుట్టూ భారీ పోలీసు బలగాలను మోహరించారు.
CCTV footage of alleged sacrliege incident at Darbar Sahib Amritsar pic.twitter.com/knSfCZEbpY
— Gagandeep Singh (@Gagan4344) December 18, 2021