Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. భారత్‌లో కొత్తగా మరో 8 కొత్త వేరియంట్‌ కేసులు.. ఎక్కడంటే..!

Omicron Variant: దేశంలో కరోనా మహహ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌..

Omicron Variant: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. భారత్‌లో కొత్తగా మరో 8 కొత్త వేరియంట్‌ కేసులు.. ఎక్కడంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 18, 2021 | 8:20 PM

Omicron Variant: దేశంలో కరోనా మహహ్మారి కేసులు ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్‌ వచ్చి ఆందోళనకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను సైతం మరోసారి వణికిస్తోంది. భారత్‌లో ఈ ఒమిక్రాన్‌ వైరస్‌ రోజురోజుకు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 123కి చేరింది.

దేశంలో కోవిడ్ పరిస్థుతలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారి కోవిడ్ కేసుల్లో 2.4 శాతం ఈ వేరియంట్ కేసులేనని తెలిపారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినవారి నుంచి ఈ వేరియంట్‌ మన దేశంలోకి వచ్చేసింది. ఈ నెల మొదటి వారంతో మన దేశంలోకి ప్రవేశించిన ఒమిక్రాన్‌ క్రమ క్రమంగా విస్తరిస్తోంది.

కరోనా మహమ్మారి వెలుగు చూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరోనా నుంచి ప్రజలు ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నారు. కరోనా వచ్చిన రెండేళ్లలో ఎన్నో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తున్నాయి. ప్రస్తుతం చేపట్టిన చర్యల వల్ల, వ్యాక్సినేషన్‌ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. కొత్త వేరియంట్‌ రూపంలో విరుచుకుపడుతోంది. ఇటీవల అత్యంత ప్రమాదకరంగా ఉన్న డెల్టా వేరియంట్‌కు మించేలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపించడంతో మరోసారి ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళకు గురి చేస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది. ఈ వేరియంట్‌ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనని భయాందోళన చెందుతున్నారు.

మళ్లీ ఆంక్షలు.. ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఈ వేరియంట్‌ కారణంగా పలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు.. మళ్లీ ఎక్కడ లాక్‌డౌన్‌ విధిస్తారోనని ఆందోళనకు గురవుతున్నారు.

యూకేలో తొలి మరణం: యూకేలో అధికంగా ఉన్న ఒమిక్రాన్‌.. వేగంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నిన్న ఒమిక్రాన్‌ తొలి మరణం సంభవించింది. దీంతో ఆదేశం మరింత అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఆ దేశంలో ఆంక్షలు విధిస్తుండగా, తొలి కరోనా మరణం నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌కు బదులు ఏం ధరించాడో చూడండి.. అతనిపై కోపంతో రగిలిపోయి విమానం దింపేసిన అధికారులు