PM Modi in UP: యోగి వైపే యూపీ ప్రజలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు

PM Narendra Modi lauds CM Adityanath: ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఒకప్పుడు వలస వెళ్లేవారిని.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌

PM Modi in UP: యోగి వైపే యూపీ ప్రజలు.. ప్రధాని నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు
Pm Modi
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:13 PM

PM Narendra Modi lauds CM Adityanath: ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు ఒకప్పుడు వలస వెళ్లేవారిని.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం హాయంలో మాఫియా శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. గత 4, 5 ఏళ్లలో మాఫియాల అనధికార ఆస్తులను యోగి బుల్‌డోజర్లతో ధ్వంసం చేసి.. శాంతి భద్రతలను కఠినంగా అవలంభిస్తూ.. ప్రజలకు వారి నుంచి విముక్తి కల్పించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అతి పొడవైన వాటిలో ఒకటి. పశ్చిమ, తూర్పు ఉత్తరప్రదేశ్‌లను అనుసంధానిస్తూ.. పన్నెండు జిల్లాలను కలుపుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 594 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే – దేశంలోనే అతి పొడవైనదని పేర్కొన్నారు. ఇది ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కొత్త తలుపులు తెరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను ప్రశంసించారు. యోగి.. మాఫియాలను తొలగించి.. అభివృద్ధి పనులను ముమ్మరం చేశారని కొనియాడారు. ఇప్పుడు ప్రజలు (యుపి ప్లస్ యోగి బహుత్ హై ఉపయోగి) మరోసారి యోగిని ఎన్నుకుంటే.. మరింత ప్రయోజనం చేకూరుతుందంటూ పేర్కొంటున్నారని మోడీ అన్నారు. మాఫియాల అనధికార ఆస్తులను యోగి బుల్‌డోజర్లతో ధ్వంసం చేశారని.. వారిని అనుసరిస్తున్న ఈ ఘటనలు బాధ కలిగించాయని విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.

యూపీలో ఇంతకుముందు ప్రాజెక్టులు కాగితాలపైనే ఉన్నాయని.. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో కనిపిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈరోజు యూపీలో వస్తున్న మార్పులు ఆధునిక మౌలిక సదుపాయాలు వనరులను ఎలా వినియోగించుకుంటున్నాయో చూపిస్తోందన్నారు. ఇంతకుముందు ప్రజా ధనాన్ని ఎలా వినియోగించారో అందరూ చూశారని.. యోగి ప్రభుత్వం సొమ్మును యూపీ అభివృద్ధికే వినియోగిస్తుందన్నారు. ఇక్కడ ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకు దేశ ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయని.. వారసత్వంతో సమస్య ఏర్పడుతుందందటూ విమర్శించారు. ఎందుకంటే వారు తమ ఓటు బ్యాంకు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలోని ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యూపీ అభివృద్ధిపై దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూపీ అభివృద్ధి చెందితే దేశం కూడా పురోగతిలో పయనమవుతుందన్నారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే యుపి పురోగతికి కొత్త తలుపులు తెరుస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

Also Read:

UP Elections 2022: కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం

Omicron: 40 శాతం కరోనా రోగులకు లక్షణాలే లేవు.. వైరస్‌ని గుర్తించడం చాలా కష్టం.. పొంచి ఉన్న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదం