Omicron: 40 శాతం కరోనా పేషంట్లకు లక్షణాలే లేవు.. వైరస్‌ని గుర్తించడం చాలా కష్టం.. పొంచి ఉన్న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదం

Covid Symptoms: కరోనా సోకిన 10 మందిలో 4 మందికి వ్యాధికి సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేకపోవడం గమనార్హం. ఇది శరీర ఉష్టోగ్రత కొలిచే యంత్రాలకు కూడా చిక్కకపోవడం గమనార్హం.

Omicron: 40 శాతం కరోనా పేషంట్లకు లక్షణాలే లేవు.. వైరస్‌ని గుర్తించడం చాలా కష్టం.. పొంచి ఉన్న కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ప్రమాదం
Venkata Chari

|

Dec 18, 2021 | 6:22 PM

Community Transmission: చైనాలోని పెకింగ్ యూనివర్శిటీ పరిశోధన ప్రకారం, కరోనా సోకిన 10 మందిలో 4 మందికి వ్యాధికి సంబంధించిన ఒక్క లక్షణం కూడా లేకపోవడం గమనార్హం. ఇది శరీర ఉష్టోగ్రత కొలిచే యంత్రాలకు కూడా చిక్కకపోవడం గమనార్హం. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించకపోవడం వల్ల ఇలాంటి రోగులు టెస్ట్ చేయించుకోలేకపోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టడం మరింత కష్టతరంగా మారిందని వారు అంటున్నారు.

మనుషుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో.. సాధారణంగా, కరోనా రోగులు పొడి దగ్గు, జ్వరం, న్యుమోనియా లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ, కొందరు ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈ వైరస్ బారిన పడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి నాలుగు కారణాలు పేర్కొంటున్నారు. చైనా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో 95 అధ్యయనాలను సమీక్షించారు. ఈ సమీక్షలో దాదాపు 3 కోట్ల మంది వ్యక్తుల డేటా ఉంది. వీటిలో 35 ఐరోపాలో, 32 ఉత్తర అమెరికాలో, 25 ఆసియాలో ఉన్నాయి. వ్యాధి లక్షణాలు లేని కరోనా రోగులను పరిశోధనలో గుర్తించారు.

పరిశోధనలో పాల్గొన్న వారిలో, 11,516 లేదా 0.25% వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ రోగులలో, 40.5% మందికి వ్యాధి లక్షణాలు లేవు. సోకిన వారిలో అత్యధికంగా 54.11% మంది గర్భిణులు ఉండడం విశేషం. విమానాలు/క్రూయిజ్‌లలో ప్రయాణించే వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు వీటిని అనుసరించారు. అతి తక్కువ లేదా ఉనికిలో లేని లక్షణాలు 60 ఏళ్లు పైబడిన వారిలో ఉన్నాయి. 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఇన్ఫెక్షన్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కరోనా లక్షణాలు లేని కేసులు వెలుగుచూశాయి. ఇందులో ఉత్తర అమెరికా ప్రథమ, యూరప్ ద్వితీయ, ఆసియా మూడో స్థానంలో నిలిచాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు లేకుండానే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే.. పరిశోధనలో, శాస్త్రవేత్తలు కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను నివారించడానికి, సాధారణ ప్రజలను గరిష్టంగా పరీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనితో పాటు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు నిరంతర పరీక్షలను నిర్వహించడం కూడా అవసరమంటూ పేర్కొన్నారు. ఎందుకంటే వారికి సంక్రమణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇది కాకుండా, తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఇప్పుడు కరోనాలో సాధారణం అయ్యాయి. కానీ, ఇప్పటికీ వాటిని తేలికగా తీసుకోకూడదు. టీకాలు వేయడం, కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించడం ఇన్‌ఫెక్షన్‌ను నిరోధించడానికి ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన మార్గాలుగా నిలిచాయి.

Also Read: UP Elections 2022: కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం

Agni Prime Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని-పి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu