Doctorate: ఇస్రో చైర్మన్‌ శివన్‌, నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

Doctorate: గ్రాడ్యుయేషన్‌, ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహించింది..

Doctorate: ఇస్రో చైర్మన్‌ శివన్‌, నటుడు ఆలీకి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం
Follow us
Subhash Goud

|

Updated on: Dec 18, 2021 | 5:19 PM

Doctorate: గ్రాడ్యుయేషన్‌, ఉన్నత విద్య కోసం దేశంలో సుప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటిగా వెలుగొందుతున్న కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవాన్ని నిర్వహించింది. తమ ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసిన 3650 మంది గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్థుల విజయాన్ని వేడుక చేస్తూ ఈ స్నాతకోత్సవం నిర్వహించారు. అండర్‌ గ్రాడ్యుయేటెడ్‌ కోర్సులలో బీటెక్‌, బీకామ్‌, బీబీఏ, బీసీఏ, బీఎస్‌సీ, బీఏ, బీఫార్మా, బీబీఏ–ఎల్‌ఎల్‌బీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌సీ, ఎంఏ వంటివి ఉన్నాయి. క్యాంపస్‌లో నిర్వహించిన ఈ స్నాతకోత్సవంలో గ్రాడ్యుయేట్స్‌తో పాటుగా వారి తల్లిదండ్రులు, మెంటార్లు, అలాగే ఏరోస్పేస్‌, ఆటోమొబైల్‌, వినోద పరిశ్రమల నుంచి సుప్రసిద్ధ వ్యక్తులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌, సెక్రటరీ, ఇతర గౌరవ అతిథులలో కమల్‌ బాలీ, అధ్యక్షులు మరియు వోల్వో గ్రూప్‌ ఎండీ ఇండియా, విశ్వ విఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, నటుడు అలీ, సిలికాన్‌ ఆంధ్రా ఫౌండర్‌ కూచిభొట్ల ఆనంద్‌ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మంత 3525 మంది గ్రాడ్యుయేట్‌ మరియు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులతో పాటుగా 125 డాక్టోరల్‌ డిగ్రీలు (పీహెచ్‌డీ)లను అందజేశారు. ప్రతి ప్రోగ్రామ్‌లోనూ స్పెషలైజేషన్‌లో అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులలో 40 మందికి బంగారు పతకాలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు 40 వెండి పతకాలను అందించారు. అలాగే ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌, కమల్‌ బాలీకి గౌరవ డిగ్రీను డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (హానరిస్‌ కాసా) అందజేశారు. అలాగే నటుడు అలీ, సిలికాన్‌ ఫౌండర్‌ కూచిభొట్ల ఆనంద్‌, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, విశ్వ విఖ్యాత ప్రవచన కర్తలకు గౌరవ డిగ్రీలను హానరరీ డిగ్రీ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ (హానోరిస్‌ కాసా)గా అందించింది.

కరోనా సమయంలో సాధించిన విజయానికి గర్విస్తున్నా: కోనేరు సత్యనారాయణ

ఈ స్నాతకోత్సవం కార్యక్రమంలో కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆవిష్కరణల ద్వారా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచానికి నేతృత్వం వహించాల్సిందిగా విద్యార్థులకు ఉద్భోదించారు. యూనివర్శిటీ విద్యార్థులు తమ జీవన వారసత్వపు ప్రతీకలు, మహమ్మారి వేళలో తీవ్ర ఒత్తిడిలో కూడా వారు సాధించిన విజయానికి ఓ విద్యావేత్తగా గర్విస్తున్నాను. యూనివర్శిటీగా మనమంతా మరోమారు కలిసి రావడంతో పాటుగా మా విద్యార్థుల అపూర్వమైన విజయాలు, పురోగతిని వేడుక చేసేందుకు అనువైన సమయం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

సవాళ్లను ధీటుగా ఎదుర్కొవాలి: ఇస్రో ఛైర్మన్‌ శివన్‌

అనంతరం గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కె శివన్‌ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్ధులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.. భవిష్యత్‌ను వారు విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ మహమ్మారి ఔత్సాహిక నాయకులకు, స్దిరంగా ఉండే అవకాశాన్ని అందించడంతో పాటుగా సవాళ్లను సైతం ధీటుగా ఎదుర్కొనేందుకు తగిన సంసిద్ధతను అందించింది. ఆర్‌అండ్‌ డీకి సంబంధించి సరైన వసతులు కలిగిన కెఎల్‌ లాంటి యూనివర్శిటీలతో, ఆవిష్కరణలు మరియు వృద్ధికి అసలైన అవకాశాలు కలుగుతాయి. యూనివర్శిటీ నాటిన ఈ విత్తనాలు మొలకెత్తడాన్ని చూడాలని ఆసక్తిగా నేను చూస్తున్నాను అని ఆయన అన్నారు.

కెఎల్‌ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ జి.పార్ధ సారధి వర్మ యూనివర్శిటీ స్నాతకోత్సవ నివేదికను సమర్పించారు. గత సంవత్సర కాలంలో యూనివర్శిటీ ప్రయాణాన్ని ఆయన ప్రేక్షకుల కళ్లముందుంచారు. ఈ యూనివర్శిటీ తమ ప్రతిభ, మౌలిక వసతులు, మెంటార్‌షిప్‌ కారణంగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును అందుకుంది. గత కొద్ది సంవత్సరాలలో ఇది 30వేల మంది విద్యార్థులకు డిగ్రీలను అందించింది.

ఇక్కడకు రావడం నా అదృష్టం భావిస్తున్నా: గోల్డ్‌ మెడలిస్ట్‌

ఈ సందర్భంగా బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడంతో పాటుగా డాక్టర్‌ ఏ సీ రావు మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌ అందుకున్న ఈ మరుపురాని దినం గురించి జల్లెల ఈశ్వర్‌ సింగ్‌ మాట్లాడారు. ఇక్కడకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అభిమానించే నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ డిగ్రీని అందుకోవడం, మరీ ముఖ్యంగా నేను అభిమానించే యూనివర్శిటీలో నేను గౌరవించే మెంటార్ల సమక్షంలో ఈ గుర్తింపు పొందడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. మహమ్మారి కాలంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇప్పుడు మటుమాయమయ్యాయని నేను భావిస్తున్నాను. మా కెరీర్‌లను గురించి ఇప్పుడు ఉత్సుకతతో చూస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం, ఈ యూనివర్శిటీలో మేము సృష్టిచుకున్న మధురస్మృతులు, మేము నిరుత్సాహ పడినప్పుడు మా మెంటార్‌లు అందించిన స్ఫూర్తిని నెమరవేసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు. నేడు ఇక్కడకు హాజరైన ప్రతి తల్లిదండ్రికి ఇది గర్వకారణమైన క్షణం. ఇక్కడ వారు తమ పిల్లలకు మద్దతునందించడం కోసం మాత్రమే రాలేదు. కానీ విద్యార్థుల విజయాలు, ఆవిష్కరణలు, అంకిత భావంతో మహమ్మారిని ధైర్యంగా అధిగమించిన విద్యార్థుల విజయాలను వేడుక చేసుకోవడానికి వచ్చారు అని ఎంటెక్‌ సీఆర్‌ఎస్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కృష్ణ జగుపిల్ల మాతృమూర్తి కనకదుర్గ జగుపిల్ల అన్నారు.

కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ గురించి:

కెఎల్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌గా 1980లో ప్రారంభమైన కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ నేడు తమతో పాటుగా 40 సంవత్సరాలకు పైగా విద్యా వారసత్వం తీసుకువచ్చింది. 2009లో ఇది డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీగా మారింది. ఏ++ గ్రేడ్‌తో నాక్‌, కేటగిరి -2 సంస్థగా యుజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ, భారత ప్రభుత్వం 2019లో గుర్తించాయి. భారతదేశంలో అత్యున్నత యూనివర్శిటీలలో 35 వ ర్యాంకును ఇది ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ 2021 ర్యాంకింగ్స్‌లో పొందింది.

విజయవాడలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కెఎల్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ ఉంది. హైదరాబాద్‌లోనూ సంస్థకు ఓ ప్రపంచ శ్రేణి క్యాంపస్‌ ఉంది. ఈ యూనివర్శిటీ ఇప్పుడు 16 దేశాలలోని 60కుపైగా విదేశీ యూనివర్శిటీలతో ఒప్పందాలు చేసుకుని విద్యార్థులకు అంతర్జాతీయ అవగాహనను ఇంటర్న్‌షిప్స్‌, ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా అందిస్తుంది. యూనివర్శిటీ వద్ద ఇంటెలెక్చువల్‌ రిసోర్స్‌లో 1200కు పైగా ఫ్యాకల్టీ సభ్యులు సైతం ఉన్నారు. వీరిలో 600కు పైగా ఫ్యాకల్టీ సభ్యులు పీహెచ్‌డీ స్కాలర్లు.

ఇవి కూడా చదవండి:

Christmas, Sankranti Hlidays: క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పుటి నుంచి అంటే..!

Delhi Schools: పాఠశాలలపై ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే