Christmas, Sankranti Hlidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పుటి నుంచి అంటే..!
Christmas, Sankranti Hlidays: క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలువులు ప్రకటించింది..
Christmas, Sankranti Hlidays: క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. ఈనెల 23 నుంచి క్రిస్మస్ సెలువులు ప్రకటించింది. అలాగే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఈ సెలవులకు క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా మిగితా పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే.
ఇవి కూడా చదవండి: