Andhra Pradesh: రైతు సభా వేదికగా ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు.. ఊహించని రీతిలో కౌంటర్ ఇచ్చిన మంత్రి..!

Andhra Pradesh: తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు,

Andhra Pradesh: రైతు సభా వేదికగా ప్రభుత్వంపై విపక్ష నేతల విమర్శలు.. ఊహించని రీతిలో కౌంటర్ ఇచ్చిన మంత్రి..!
Balineni Srinivas Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2021 | 4:09 PM

Andhra Pradesh: తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించిన సభలో వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు, సీపీఐ రామకృష్ణ, వైసీపీ ఎంపీ రఘరామలకు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. విపక్ష నేతలు మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజదాని అమరావతిలోనే ఉంటుందని ప్రధాని మోడీ ఎప్పుడూ చెప్పలేదని, బహుశా సీపీఐ రామకృష్ణకు ఫోన్‌లో చెప్పారేమో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌కు ప్రధాని మోడీ ఎలాంటి ఫోన్‌ చేయలేదని స్పష్టం చేశారు.

చంద్రబాబు ఐదేళ్ళలో కరకట్టపై రోడ్డే వేయలేకపోయారని, రాజధానిని గ్రాఫిక్‌లో చూపించి మోసం చేయడం వల్లే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారన్నారు. వైసీపీ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎంపీ రఘరామకృష్ణంరాజు ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని నిప్పులు చెరిగారు. రఘరామకు దమ్ము, దైర్యం ఉంటే పదవికి రాజనామా చేసి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలని మంత్రి బాలినేని సవాల్‌ విసిరారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ది జరిగిన ప్రాంతమని, అదే ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ది చేయడానికి పెద్దగా నిధులు అవసరం ఉండదన్నారు. ఎపీలో మంత్రి విర్గ విస్తరణ విషయంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

Also read:

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో