AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

MLA RK Roja Comments: నిన్నటి రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిట‌లిస్టుల..

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
Subhash Goud
|

Updated on: Dec 18, 2021 | 3:33 PM

Share

MLA RK Roja Comments: నిన్నటి రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన సభ క్యాపిటల్ కోసం కాదని క్యాపిట‌లిస్టుల కోసం జరిగిన సభని విమర్శించారు. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించుకున్న సభ అంటూ ఏద్దేవా చేశారు రోజా. తిరుపతిలో సభ రాజధాని రైతులది కాదు.. క్యాపిటల్ కోసం కాదు క్యాప్టలిస్టులు చేసిన సభ. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించుకున్న సభ. ఇప్పటివరకు ముసుగులు ధరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విషం కక్కిన వాళ్ళు ఇప్పుడు ఒక చోట చేరారు.

రాష్ట్రాన్ని నాశనం చేయాలను కుంటున్నారు అని ఆరోపించారు. 29 గ్రామాల గురించే మాట్లాడుతున్నారు తప్ప 13 జిల్లాల గురించి మాట్లాడని నేతలు రాయలసీమ, ఉత్తరాంధ్రకు మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలుకు రెండో రాజధాని, హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు చంద్రబాబు పక్కన కూర్చొని అమరావతికి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. రాయలసీమకు అన్యాయం చేయడంలో ముందు ఉన్న చంద్రబాబు, సిపిఐ నారాయణలను రాయలసీమ ప్రజలు నిలదీయాలని రోజా ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..

Amaravati JAC Public Meeting Tirupati: ప్రజా రాజధానుల మహాసభ… అమరావతిపై రైతులకు మద్దతుగా ..(వీడియో)