Cheddi Gang: అమ్మో చెడ్డీ గ్యాంగ్.. ఆ పదం అన్నారంటే అంతే సంగతులు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..!

Cheddi Gang - Vijayawada: షికార్.. ఇది మనల్ని సరదాగా బయటకు నడిపించే పదం. కానీ చెడ్డీ గ్యాంగ్‌కు మాత్రం దోపిడీకి స్పెషల్ కోడ్.

Cheddi Gang: అమ్మో చెడ్డీ గ్యాంగ్.. ఆ పదం అన్నారంటే అంతే సంగతులు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..!
Cheddi Gang
Follow us

|

Updated on: Dec 18, 2021 | 4:01 PM

Cheddi Gang – Vijayawada: షికార్.. ఇది మనల్ని సరదాగా బయటకు నడిపించే పదం. కానీ చెడ్డీ గ్యాంగ్‌కు మాత్రం దోపిడీకి స్పెషల్ కోడ్. అవును షికారుకి  వెళ్లొద్దామని చెడ్డీగ్యాంగ్ అనుకుందంటే ఎక్కడో ఇళ్లకు తాళాలు పగలిపోతాయని అర్థం. ఈ గ్యాంగ్ షికారు వెళ్లాలని నిర్ణయించుకుంటే సభ్యుల కోసం ప్రత్యేక ఎంపికలు ఉంటాయి. గ్రామంలోని యువకులందరినీ ఓ చెట్టుకిందకు రప్పిస్తారు. వారిలో బలవంతులనే గ్యాంగ్‌లోకి ఎంపిక చేస్తారు. ఎక్కువ నేరాలకు పాల్పడి, పోలీసులకు పట్టుబడకపోవడమే గ్యాంగ్ లీడర్‌కు ఉన్న ముఖ్యమైన అర్హత. నేరాలు చేయడంలో పిల్లలకు తల్లిదండ్రులే శిక్షణ ఇస్తారు. చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ఇటీవల దాహోద్ వెళ్లిన ఏపీ పోలీసులు.. అక్కడ వీరి జీవనశైలికి సంబంధించిన అనేక కొత్త విషయాలను గుర్తించారు. మరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి నేర చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన ఘటనలు సంచలనం రేకెత్తించింది. అర్ధరాత్రి సమయంలో చెడ్డీలు వేసుకొని దోపిడీలు చేయడం ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. నగర శివారు ప్రాంతంలోని అపార్ట్‌మెంట్స్, ప్రముఖుల ఇళ్లలో సైతం దోపిడీలకు పాల్పడ్డారు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు. తొలుత విజయవాడ పాల ఫ్యాక్టరీ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ లో చొరబడిన చెడ్డీ గ్యాంగ్.. తలుపులు పగలగొట్టి ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. అపార్ట్‌మెంట్‌లోని పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు చెడ్డీలు ధరించి వచ్చి దోపిడీకి పాల్పడినట్లు పాల్పడినట్టు గుర్తించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉండగా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గుంటుపల్లిలో ఉన్న నల్లూరి ఎనక్లేవ్ లోకి ఇదే గ్యాంగ్ ఎలక్ట్రిక్ కంచెలను తొలగించి దోపికి పాల్పడినట్టు గుర్తించారు. బాధితుల పిర్యాదుతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

ఆ గ్యాంగ్ పనే అని.. మళ్లీ రోజు వ్యవధిలోనే పెనమలూరు పీఎస్ పరిధిలోని ఓ ఇంటోకి మారణాయుధాలతో చొరబడి దోపిడీకి పాల్పడి వెండి, నగదును దోచుకెళ్లారు. అనంతరం తాడేపల్లిలోని రెయిన్‌బో విలాస్‌ను టార్గెట్‌గా చేసుకొని.. ప్రముఖలు వుండే ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. చోరీకి పాల్పడిన రెండు ఇళ్లలో ఒకటి ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు ఇల్లు. ఈ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దీంతో అక్కడి సెక్యురిటి సిబ్బందికి అలికిడి కావడంతో నిందితులు అక్కడ నుండి తపించుకొని పరారైయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడలో చోరీలకు పాల్పడిన ముఠా పనేనని గుర్తించి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా గుజరాత్ కి చెందిన చెడ్డి గ్యాంగ్ గా గుర్తించి ప్రత్యక బృందాలను గుజరాత్ పంపించారు పోలీసు అధికారులు.

సాధారణ సమయాల్లోనూ అదే.. విజయవాడ నుండి గుజరాత్ వెళ్లిన పోలీసులు.. ముగ్గురు చెడ్డీగ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దాహోద్ వెళ్లిన పోలీసులు చెడ్డీగ్యాంగ్ జీవనవిధానం పైనా సమాచారం సేకరించారు. నేరాలు చేసేటప్పుడే కాదు. ఇళ్ల వద్ద ఉన్నప్పుడు కూడా ఈ గ్యాంగ్ చెడ్డీ, బనియన్‌తోనే ఉంటారని గుర్తించారు. పోలీసులకు చిక్కిన ముగ్గురు ఈ అవతారాల్లోనే ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గుల్బర్ గ్రామానికి చెందిన మడియా కాంజీ మేడా రాత్రిపూట ఇంటి వద్ద నులక మంచంపై చెడ్డీ, బనియన్తో నిద్రపోతుండగా ఏపీ పోలీసులు.. దాహోద్ పోలీసుల సహకారంతో అక్కడికి చేరుకున్నారు. పోలీస్ జిపును చూడగానే మడియా మంచం దిగి, ఇంటి వెనుక ఉన్న మొక్కజొన్న తోటల్లోకి పారిపోయాడు. పోలీసులు అతడి వెంట పరుగులు తీశారు. చివరికి నలుగురు పోలీసులు అతడిపైకి దూకి పట్టుకున్నారు. చిన్నచిన్న కొండల మధ్య 20, 30 అడుగుల దూరంలో చిన్నచిన్న గుడారాల్లో వాళ్లు నివసిస్తారు. వాళ్లంతా ఆదివాసీలోని మేడా తెగకు చెందినవారు. వారి ఇళ్ల వెనుక భారీగా మొక్కజొన్న తోటలు ఉంటాయి. పోలీసులు వచ్చారని గ్రహిస్తే వాటిల్లోకి పారిపోతారు.

అంతా మహిళలే.. ఈ గ్యాంగ్‌లోని సభ్యులు ఎక్కువగా రొట్టెను ఆహారంగా తీసుకుంటారు. చోరీలకు వచ్చినప్పుడు పగటి పూట రహదారులపై కార్మికుల్లా సంచరిస్తారు. రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళి తలదాచుకుంటారు. విజయవాడలో ఇలా వ్యవహరిస్తూనే శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. చెడ్డీగ్యాంగ్ సభ్యులు స్థానికంగా ఎలాంటి గుర్తింపు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వివిధ సర్వేల నిమిత్తం ఇళ్లకు వెళ్లిన రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు ఆ ఇంట్లోని పురుషులు కనిపించరు. అన్ని వివరాలను ఇళ్లలో ఉండే మహిళలే ఇస్తారు. ఎక్కువగా ఆయా శాఖల అధికారులు గ్రామ పెద, లేక సర్పంచ్ వద్దకు వెళ్లి వివరాలు తీసుకుని వెళ్లిపోతారని సమాచారం.

తల్లిదండ్రులే దగ్గరుండి మరీ.. పిల్లలకు తల్లిదండ్రులే నేరాలు ఎలా చేయాలో తర్పీదును ఇస్తారు. గుల్బర్ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాఠశాలలో ఉంది. ఈ గ్యాంగ్ పిల్లలందరికీ అక్కడే విద్యాభ్యాసం. చదువుకోవడం ఇష్టం లేదనుకున్నప్పుడు వారిని చోరి వృత్తిలోకి దింపుతారు. ఒకచోట చోరీకి వెళ్లినప్పుడు ఇళ్లలోకి ఎలా ప్రవేశించాలి, చుట్టుపక్కల వారికి చిక్కకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, చోరీ చేశాక ఎలా స్థావరాలకు చేరుకోవాలి? తదితర అంశాల్లో మహిళలే శిక్షణ ఇస్తారు.

అగ్రభాగం నాయకుడికే.. దాహోద్‌కు పడమర వైపున కొండలతో కూడిన ప్రాంతం ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్‌కి వస్తుంది. తూర్పున గుజరాత్ ఉంటుంది. ఈ రెండింటికీ పై భాగాన రాజస్థాన్ ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో నేరాలు చేసిన తర్వాత చెడ్డీగ్యాంగ్‌లు ఈ మూడు రాష్ట్రాలకు పారిపోతాయి. వీరి నుంచి చోరీ సొత్తును కొనుగోలు చేయడానికి గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక బృందాలు ఉంటాయి. బరువును బట్టి బేరాలు జరుగుతాయి. పోలీసులు రికవరీలకు వెళ్లినప్పుడు ఎంతో కొంత బంగారాన్ని అప్పగించి రిసీవర్లు చేతులు దులుపుకుంటారు. ఒక్కో బృందం రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు సంపాదిస్తుంది. దానిలో అగ్రభాగాన్ని టీమ్ లీడర్ తీసుకుంటాడు. మిగిలిన భాగాన్ని సభ్యులకు పంచుతాడు.

షికార్.. ఒక్కసారి షికార్‌‌కు వెళ్లాలని చెడ్డీ గ్యాంగ్ మెంబర్స్ నిర్ణయించుకుంటే చోరీ కోసం ప్రత్యేక ఎంపికలు ఉంటాయి. గ్యాంగ్‌లో ఐదు నుంచి ఏడుగురికి మించి సభ్యులు లేకుండా చూసుకుంటారు. గ్రామంలో ఉన్న యువకులను ఒక చెట్టు కిందకు పిలిపిస్తారు. వారిలో బలవంతులను చూసి మరీ ఎంచుకుంటారు. వారితోనే గ్యాంగ్ తయారవుతుంది. పలుమార్లు నేరాలు చేసి పోలీసులకు చిక్కకుండా ఉండేవారు ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తారు. ఇలా ఎంపికయిన సభ్యుల కుటుంబాలకు ఖర్చుల నిమిత్తం రూ.10వేల వరకు ఇస్తారు. ఎన్ని రోజులు, ఏ ప్రాంతంలో షికార్ చేయాలో అక్కడే నిర్ణయించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నప్పుడు చెన్నై వరకు వెళ్తారు. ఉత్తరానికి వెళ్లాలనుకున్నప్పుడు రాజస్థాన్ అమ్మతి వరకు వెళ్తారు. పురుషులంతా కూలీలుగా ఉంటారు.

ఇవి కూడా చదవండి:

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో