AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. యూపీతో పాటు దేశంలోని మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికలకు అన్ని రకాల సన్నాహాలు ప్రారంభించింది.

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!
Elections 2022
Balaraju Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:50 PM

Share

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు భారత ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. యూపీతో పాటు దేశంలోని మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఎన్నికలకు అన్ని రకాల సన్నాహాలు ప్రారంభించింది. మీడియా కథనాల ప్రకారం జనవరి మొదటి వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటన వెలువడవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలను జనవరి 5 తర్వాత ఎప్పుడైనా ప్రకటించవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. జనవరి మొదటి వారంలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే వారం ఎన్నికల సంఘం బృందం.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పర్యటించిన, ఆ తర్వాత ఎన్నికల ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.

యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు? ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల సంఘం కూడా దీని ఆధారంగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. నిజానికి పెద్ద రాష్ట్రం కావడంతో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అదే సమయంలో, 2017 సంవత్సరంలోనూ రాష్ట్రంలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగా మిత్రపక్షాలతో కలిపి 325 సీట్లు సాధించి అధికారం దక్కించుకుంది.

మార్చి మొదటి వారంలో పోలింగ్! మార్చి నెలలో ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే బీఎస్‌ఈతో సహా రాష్ట్ర విద్యా బోర్డుల పరీక్షలు మార్చి ఏప్రిల్‌లో జరుగుతాయి. అందుకే ప్రతిపాదిత పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మార్చి మొదటి వారంలోనే ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. విశేషమేమిటంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ మార్చి 8న ముగియగా, మార్చి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. మీడియా సమాచారం ప్రకారం, 2017 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మొత్తం వ్యవధి 64 రోజులు.

Read Also….  ABVP Protest: ఇంటర్ బోర్డును ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్!