Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Elections 2022: కెప్టెన్‌, కమలం పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌ రాజకీయాల్లో కీలక సమీకరణాలు..

పంజాబ్‌లో కెప్టెన్‌-కమలం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరుపార్టీల నేతలు సంయుక్తంగా..

Punjab Elections 2022: కెప్టెన్‌, కమలం పార్టీల మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌ రాజకీయాల్లో కీలక సమీకరణాలు..
Bjp Announces Alliance With
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:46 PM

పంజాబ్‌లో కెప్టెన్‌-కమలం పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇరుపార్టీల నేతలు సంయుక్తంగా ప్రకటించారు. పంజాబ్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ..ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తోంది. తాజాగా బీజేపీ-అమరీంద్‌సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీతో పొత్తు ప్రయత్నాల్లో భాగంగా కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ కేంద్ర మంత్రి…పంజాబ్‌ బీజేపీ ఇంఛార్జ్‌ గజేంద్రసింగ్‌ షేకావత్‌తో భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని డెసిషన్‌కి వచ్చారు. మొత్తం ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఇద్దరి నేతల మధ్య క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ-పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర మంత్రి…సీనియర్‌ నేత గజేంద్రసింగ్ షేకావత్‌ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటు అంశాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 101 శాతం తాము విజ‌యం సాధిస్తామ‌ని విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ సీఎం పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌. బీజేపీతో సుధీర్ఘ చర్చల తర్వాత తానూ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నానని చెప్పారు. ప్రతి స్థానాన్ని పరిశీలించి…అక్కడి పరిస్థితులను బట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌.

కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇటీవలే పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు కెప్టెన్‌ అమరీందర్‌సింగ్. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో బీజేపీకి దగ్గరయ్యారు కెప్టెన్‌. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..