Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..

ఆయనది సక్సెస్ చరిత్ర.. గెలుపు ఆయన ఇంటి చిరునామ. విజయం ఆయన కేరఫ్ అడ్రస్. అయితే ఆయన అంచనాలు తిరగబడ్డాయి. ఆయనే దలాల్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా. అలాంటి మార్కెట్ హీరోకే..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..
Jhunjhunwala
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 17, 2021 | 6:18 PM

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లు భారీ షాక్ ఇచ్చాయి. బిగ్ బుల్‌నే కుమ్మేశాయి. ఆయన అడుగు పెడితే మార్కెట్లు అటు  వైపు చూడాల్సిందే.. ఆయన క్లిక్ చేస్తే ఆ షేర్ పరుగులు పెట్టాల్సందే. ఆయనది సక్సెస్ చరిత్ర.. గెలుపు ఆయన ఇంటి చిరునామ. విజయం ఆయన కేరఫ్ అడ్రస్. అయితే ఆయన అంచనాలు తిరగబడ్డాయి. ఆయనే దలాల్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ ఝున్‌జున్‌వాలా. అలాంటి మార్కెట్ హీరోకే నేటి మార్కెట్లు  భారీ షాక్ ఇచ్చాయి. కేవలం 10 సెకెన్లు.. అంటే.. పదే పది సెకెన్లు.. కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా ఆవిరైపోాయాయి.

ఇందకు మార్కెట్ వార్గాలు ఒక్కటే కారణం చెబతున్నాయి. బలహీనమైన గ్లోబల్ సూచనల కారణంగా  భారతీయ స్టాక్ మార్కెట్ ఉదయాన్నే డీల్స్‌లో నష్టపోయిందని. వీకెండ్ శుక్రవారం రోజు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్‌ భయాలు, ఫెడ్‌ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈరోజు నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు క్షీణించగా, బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈ స్టాక్ మార్కెట్‌లో టైటాన్ కంపెనీ షేర్లలో మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఏస్ రాకేష్ జున్‌జున్‌వాలా రూ. 318 కోట్లను కోల్పోయారు.

టైటాన్ కంపెనీ షేరు ధర ఈరోజు రూ. 2,336 స్థాయిల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:25 వద్ద షేరు స్థాయిలకు రూ. 2,283.65 వద్ద దిగజారింది. ఈరోజు ప్రారంభ గంట తర్వాత కేవలం 10 నిమిషాల తర్వాత.. సీన్ మొత్తం మారిపోయింది.

టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌జున్‌వాలా షేర్ హోల్డింగ్

టైటాన్ కంపెనీ షేర్ ధర నిన్న NSEలో ఒక్కో షేరు స్థాయికి రూ. 2,357.25 వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత రూ. 2,283.65 వద్ద ముగిసింది. ఈ కాలంలో ఒక్కో షేరుకు రూ. 73.60 నష్టపోయింది. జూలై నుండి సెప్టెంబర్ 2021 త్రైమాసికానికి టైటాన్ కంపెనీ షేర్‌హోల్డింగ్ విధానం ప్రకారం.. ఈ టాటా కంపెనీలో రాకేష్ జున్‌జున్‌వాలాతోపాటు అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా వాటాను కలిగి ఉన్నారు.

రాకేష్ జున్‌జున్‌వాలా టైటాన్ కంపెనీ  3,37,60,395 షేర్‌లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం జారీ చేసిన పెయిడ్ అప్ క్యాపిటల్‌లో 3.80 శాతం. అదేవిధంగా, రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో 95,40,575 కంపెనీ షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. కాబట్టి, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలా కలిసి 4,33,00,970 టైటాన్ కంపెనీ షేర్‌లను కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి: బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..

Bandi Sanjay: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..