బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..

Almonds Benfits: బాదంలో శరీరానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంపప్పును రోజూ తీసుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. ని

బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..
Almand
Follow us

|

Updated on: Dec 17, 2021 | 1:13 PM

Almonds Benfits: బాదంలో శరీరానికి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. బాదంపప్పును రోజూ తీసుకుంటే అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. నిజానికి ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. బాదంపప్పులో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది. ఇది హానికరమైన UV కిరణాల నుంచి చర్మం, జుట్టును రక్షిస్తుంది. ఇది కాకుండా బాదంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం, జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో తోడ్పడుతాయి. బాదంపప్పులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లక్షణాలు మొటిమలను తొలగిస్తాయి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మీరు బాదంపప్పును తీసుకుంటే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ 5 ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది బాదం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పని చేస్తుంది. ఇది LDL (రక్తంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్)ని తగ్గించడం లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లిపిడ్లను ఆక్సీకరణం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బాదం రక్తపోటును తగ్గిస్తుంది.

2. జ్ఞాపకశక్తిని పెంచుతుంది బాదంపప్పులో విటమిన్ ఈ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మంచి జ్ఞాపకశక్తి కోసం ప్రతిరోజూ 2-3 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం పాలతో తినాలి.

3. శారీరక అభివృద్ధి, శక్తిని మెరుగుపరచడం కోసం శారీరక అభివృద్ధి, శక్తిని మెరుగుపరచడానికి 1 కప్పు బాదం పొడిని బెల్లం, పాలతో కలిపి ఉడికించాలి. తర్వాత తినాలి. ఇది పిల్లల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. కానీ 25 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.

4. జుట్టు పెరుగుదల కోసం మీరు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, జుట్టు రాలడాన్ని నిరోధించాలనుకుంటే వారానికి ఒకసారి మీ తలకు గోరువెచ్చని బాదం నూనెను రాయాలి.

5. డార్క్ సర్కిల్స్ తగ్గించండి మీరు కళ్లకింద నల్లటి వలయాల సమస్యతో ఇబ్బంది పడుతుంటే బాదం నూనెను ఒక నెలపాటు క్రమం తప్పకుండా అప్లై చేయాలి. తద్వారా వాటిని పొగొట్టవచ్చు.

26 బంతులు 73 పరుగులు 9 సిక్సర్లు.. వెంటనే ఫేమస్‌ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌

ఈ చిన్న చిన్న పొరపాట్లు లక్ష్మిదేవికి ఆగ్రహం తెప్పిస్తాయి.. ఫలితం పేదరికంలో మగ్గిపోతారు..

కుక్కతో సెల్ఫీ ట్రై చేస్తున్నారా..! రంగు పడుద్ది జాగ్రత్త.. ఈ విషయం తెలిస్తే షాక్..

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...