Almonds & Raisins Benefits: నానబెట్టిన బాదం.. నానబెట్టిన ఎండుద్రాక్షలను కలిపి తీసుకుంటే ఈ వ్యాధులు దూరం.. ప్రయోజనాలు ఎన్నంటే..

సాధారణంగా నానబెట్టిన బాదం తినడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. రోజూ ఉదయాన్నే రెండు నానబెట్టిన బాదం 

Almonds & Raisins Benefits: నానబెట్టిన బాదం.. నానబెట్టిన ఎండుద్రాక్షలను కలిపి తీసుకుంటే ఈ వ్యాధులు దూరం.. ప్రయోజనాలు ఎన్నంటే..
Almonds
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2021 | 3:08 PM

సాధారణంగా నానబెట్టిన బాదం తినడం వలన అనేక ప్రయోజనాలుంటాయి. రోజూ ఉదయాన్నే రెండు నానబెట్టిన బాదం  తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఎండు ద్రాక్షలను తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఎండు ద్రాక్షలను విడిగా తీసుకోవడమే కాదు.. నానబెట్టి తీసుకున్న అనేక లాభాలున్నాయి. అయితే నానబెట్టిన బాదం.. నానబెట్టిన ఎండుద్రాక్షలను కలిపి తీసుకుంటే ఇంకా అనేక లాభాలున్నాయి. ఉదయాన్నే అల్పాహారంలో నానబెట్టిన బాదం, నానబెట్టిన ఎండుద్రాక్షలను తింటే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

నానబెట్టిన బాదం, నానబెట్టిన ఎండుద్రాక్షలలో ప్రోటీన్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ప్రోటీన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రెండింటీని ఉదయం అల్పాహరంగా తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయి. ఈ రెండింటీని ఉదయాన్నే తినడం వలన పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీంతో అలసటగా అస్సలు అనిపించదని డాక్టర్ దీక్షా భావ్సర్ తన ఇన్ స్టాలో తెలియజేశారు.

అల్పాహారంలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్షలను కలిపి తీసుకోవడం నలన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అలాగే ఈ రెండింటీని కలిపి తినడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే చర్మం, జుట్టు సమస్యలను తొలగిపోతాయి. బాదం, ఎండు ద్రాక్ష రెంండింటీలోనూ యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తాయి. రోజూ వీటిని ఉదయాన్నే తినడం వలన కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.

Also Read: Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Bheemla Nayak: వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ చిత్ర యూనిట్.. పవన్ కోసం సందడి చేస్తున్న ఫ్యాన్స్

Pushpa: థియేటర్లలో అదరగొడుతున్న ‘పుష్ప’ రాజ్.. బన్నీ సినిమాకి సంబంధించిన 9 అద్భుతాలు ఇవే!

Pushpa Movie: ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో సందడి అల్లు అర్జున్.. ఎగబడిన ఫ్యాన్స్