Pushpa Movie: ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో సందడి అల్లు అర్జున్.. ఎగబడిన ఫ్యాన్స్

థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ అండ్‌ ఫ్యామిలీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు బన్నీ. ఆయన కార్‌ చుట్టూ చేరి బన్నీని చూసేందుకు.

Pushpa Movie: ఫ్యామిలీతో కలిసి థియేటర్‌లో సందడి అల్లు అర్జున్.. ఎగబడిన ఫ్యాన్స్
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 17, 2021 | 1:00 PM

Pushpa Movie: థియేటర్‌కు వచ్చిన అల్లు అర్జున్‌ అండ్‌ ఫ్యామిలీని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయలేదు బన్నీ. ఆయన కార్‌ చుట్టూ చేరి బన్నీని చూసేందుకు… సెల్ఫీ తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చూట్టూ ఉన్న బన్నీ బాక్సర్స్… అండ్‌ పోలీసులను కూడా లెక్కచేయకుండా… వారు కంట్రోల్‌కు అందకుండా బన్నీ చూడడం కోసం ఆరాట పడ్డారు ఫ్యాన్స్. అయితే ఫ్యాన్స్‌ను అందరి హీరోల కంటే ఎక్కువగా ప్రేమించే బన్నీ… దీన్నంతా సీరియస్గా తీసుకోకుండా చిరునవ్వుతో… అందరికీ కనిపించారు. థియేటర్‌ లోపలికి వెళ్లడానికి ఎంత కష్టమైనా.. ఓర్చుకుంటూ… ఫ్యాన్స్కు ఆనందాన్ని పంచారు. ఫ్యాన్స్తో కలిసి సినిమాను చూశారు. వారి అభిమానాన్ని… హంగామా ను చూసి మురిసిపోయారు. ఇదిలా ఉంటే..

అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ అంటే థియేటర్లకు అడ్డా.. సినిమాను చూడాలన్నా… గొంతుచించుకుని అరవాలన్నా… హంగామా చేయాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ గడ్డే.! అందుకే అక్కడి థియేటర్లలో ఏ సినిమా రిలీజైనా… ఆసినిమా హీరో వచ్చి ఫ్యాన్స్ రెస్పాన్స్ ను చూస్తుంటారు. సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక ఈ కారణంతోనే మరింత మంది ఫస్ట్ డే సినిమా చూసేందుకు ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న థియేటర్లను ఎంచుకుంటూ ఉంటారు. సినిమాతో పాటు పనిలో పనిగా హీరోను కూడా చూసేయెచ్చని అనుకుంటారు. అలా తాజాగా అల్లు అర్జున్‌ కూడా పుష్ప రాజ్‌ సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌లో వస్తారనుకున్న ఫ్యాన్స్ ఆయన రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే పుష్పరాజ్‌ గెటప్‌ లో వచ్చిన మరొకరి చూసి అందరూ బన్నీ అనుకున్నారు. సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. సరిగ్గా చూసి కాని చివరకు అతడో డూప్లికేట్‌ పుష్పరాజ్‌ అని విషయం తెలుసుకోలేకపోయారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: పుష్ప సినిమాపై స్పందించిన మెగా పవర్‌స్టార్‌.. ట్విట్టర్లో ఏం చెప్పారంటే..

Manasa Varanasi: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కరోనా కలకలం.. మహమ్మారి బారిన పడిన మిస్‌ ఇండియా.. తాత్కాలికంగా పోటీల వాయిదా..

Vishal : ‘ఎనిమి’ కాంబో రిపీట్.. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న విశాల్ 33.. దర్శకుడు ఎవరంటే.