AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ లడ్డూలు తినాల్సిందే.. చలితోపాటు జలుబు కూడా మాయం..!

చలికాలంలో వీచే శీతల గాలుల వల్ల చిన్నపాటి అనారోగ్యాలు మనకు చాలా హాని కలిగిస్తాయి.

Winter Health Tips: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ లడ్డూలు తినాల్సిందే.. చలితోపాటు జలుబు కూడా మాయం..!
Sonth Ladoo
Venkata Chari
|

Updated on: Dec 17, 2021 | 6:37 PM

Share

Winter Health Tips: చలికాలంలో వీచే శీతల గాలుల వల్ల కలిగే నష్టం మనందరికీ తెలిసిందే. ఈ చల్లటి గాలులతో చిన్న వ్యాధుల నుంచి తీవ్రమైన హానిని కలిగిస్తాయి. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. మనలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిస్థితిలో లోపల నుంచి శరీరం వెచ్చగా ఉండటానికి ఎండు అల్లం లడ్డులను తినాల్సిందేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. అవును, డ్రై అల్లం లడ్డూలు మన శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

చలికాలంలో ఎండు అల్లం లడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జలుబు నుంచి ఉపశమనం- చలికాలంలో ముక్కు కారటం, జలుబు సమస్య చాలా సాధారణంగా ఉంటుంది. వాతావరణ మార్పులతో ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు పొడి అల్లం లడ్డులను తినాలి. ఎందుకంటే డ్రై అల్లం లడ్డూలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. మీరు దీన్ని వేడి నీటితోనూ తినవచ్చు.

జీవక్రియను మెరుగుపరుస్తుంది- వ్యాధులను దూరంగా ఉంచడంలో జీవక్రియ పెద్ద పాత్ర పోషిస్తుంది. శరీరంలో జీవక్రియలు ఎంత వేగంగా జరిగితే అన్ని వ్యాధులు దూరం అవుతాయి. మరోవైపు, మీరు ప్రతిరోజూ ఒక ఎండు అల్లం లడ్డూను తీసుకుంటే, మీ జీవక్రియ సక్రమంగా ఉండడంతోపాటు తక్కువ అనారోగ్యానికి గురవుతారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది- రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచాలంటే మాత్రం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ప్రతిరోజూ ఎండు అల్లం లడ్డులను తినాలి.

Also Read: Almonds & Raisins Benefits: నానబెట్టిన బాదం.. నానబెట్టిన ఎండుద్రాక్షలను కలిపి తీసుకుంటే ఈ వ్యాధులు దూరం.. ప్రయోజనాలు ఎన్నంటే..

బాదంపప్పుతో ఈ 5 సమస్యలకు పరిష్కారం..! ఔషధాల కంటే తక్కేవేమి కాదు.. ఎలాగో తెలుసుకోండి..