- Telugu News Photo Gallery Side Effects of Turmeric Consumption of turmeric in excess is harmful for health know its disadvantages here is the full details
Side Effects of Turmeric: పసుపును అధికంగా వినియోగిస్తున్నారా?.. ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
Side Effects of Turmeric: పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం సహా అనేక ప్రముఖ గ్రంధాల్లో పేర్కొనబడింది. అనేక వ్యాధులకు పసుపును దివ్య ఔషధంగా పసుపును వినియోగిస్తుంటారు. అయితే, అతి ఎప్పుడూ హానీకరమే అన్నట్లుగా.. పసుపు కూడా అతిగా తీసుకుంటే ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి రోజుకు 1-2 గ్రాముల పసుపు తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి తీసుకుంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Dec 17, 2021 | 10:36 PM

పసుపు చర్మానికి మంచిదని భావిస్తారు. ఇది అన్ని సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగించబడుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ కూడా వస్తాయి. అలాగే, శ్వాస సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందువల్ల, ఏదైనా సమస్యలో పసుపును ఎక్కువ మోతాదులో ఔషధంగా తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి.

కొంతమంది ప్రతిదాంట్లో పసుపును ఉపయోగిస్తారు. కానీ పసుపులో ఉండే కర్కుమిన్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఫలితంగా వాంతులు, లూజ్ మోషన్స్ వంటి సమస్యలు వస్తాయి.

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, పసుపులో ఉండే ఆక్సలేట్ శరీరంలో కాల్షియం కరిగిపోనివ్వదు. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.

పసుపు రుచి చాలా వేడి చేస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో వికారం, ఉబ్బరం, తిమ్మిర్లు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పసుపును అధికంగా తీసుకోవడం మానుకోవాలి. లేదంటే గర్భస్రావం అయ్యే పరిస్థితి కూడా తలెత్తుతుంది.





























