26 బంతులు 73 పరుగులు 9 సిక్సర్లు.. వెంటనే ఫేమస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్
Cricket News: విరాట్ కోహ్లీకి ఛేజింగ్ అంటే ఇష్టం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ విరాట్ కోహ్లిలా ఛేజింగ్‌ను ఇష్టపడే మరో
Cricket News: విరాట్ కోహ్లీకి ఛేజింగ్ అంటే ఇష్టం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ విరాట్ కోహ్లిలా ఛేజింగ్‌ను ఇష్టపడే మరో వ్యక్తి పాకిస్థాన్‌లో కూడా ఉన్నాడు. అందుకే విరాట్ కోహ్లితో టై అప్ అయిన కంపెనీ ఇప్పుడు ఆ క్రికెటర్‌తో కూడా టై అప్ అయింది. విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ 8 ఏళ్లు కాగా, పాక్ ప్లేయర్ 2 ఏళ్లు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు పాకిస్థాన్ ఆల్ రౌండర్ అసిఫ్ అలీ. అతనితో క్రీడా దుస్తుల కంపెనీ ప్యూమా రాబోయే 2 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్యూమా బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన తొలి పాకిస్థానీ ఆటగాడిగా ఆసిఫ్ అలీ గుర్తింపు సాధించాడు. విరాట్ కోహ్లి, ప్యూమా మధ్య 2017 సంవత్సరంలో 8 సంవత్సరాల పాటు ఒప్పందం జరిగింది. విరాట్ కోహ్లి భారతదేశంలో పూమా బాండ్ అంబాసిడర్ లాగే ఆసిఫ్ అలీ పాకిస్తాన్‌లో దాని బాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతాడు.
26 బంతులు, 73 పరుగులు 9 సిక్సర్లు క్రికెట్‌లో ఆసిఫ్ అలీకి.. విరాట్ కోహ్లీలాగా ఛేజింగ్ అంటే చాలా ఇష్టం. దీనికి నిదర్శనం గత 3 T20 లలో అతని ప్రదర్శన. దీని కారణంగా అతను తన అభిమానులను పెంచుకోవడమే కాకుండా PCB, కెప్టెన్ బాబర్ ఆజం నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. చివరి 3 టీ20ల్లో ఛేజింగ్‌లో ఆసిఫ్ అలీ కేవలం 26 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 280 కంటే ఎక్కువగా ఉంది. అతని బ్యాట్ ద్వారా 9 సిక్సర్లు జాలువారాయి.
ఆసిఫ్ అలీ పరుగుల వేట ఇప్పుడు ఈ 3 T20 మ్యాచ్‌లలో అతని పరుగులను గమనించినట్లయితే.. ముందుగా న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 24 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు అసిఫ్ అలీ 12 బంతుల్లో 27 నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌కు 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు ఆసిఫ్ అలీ కేవలం 7 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచ్‌లు టీ20 ప్రపంచకప్‌లో జరిగాయి. ఇక ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో పాకిస్థాన్ 16 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆసిఫ్ అలీ 7 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.