- Telugu News Sports News Cricket news Ipl 2022 kl rahul to captain lucknow shreyas iyer to lead ahmedabad franchise
IPL 2022: ఐపీఎల్ స్టార్లంతా ఆ రెండు టీంలతోనే.. కీలక ప్లేయర్ల కోసం పక్కా ప్లాన్.. ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడే
ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ముందు బిగ్ న్యూస్ వినిపిస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఆయా జట్లకు కెప్టెన్లుగా మారనున్నారని టాక్...
Updated on: Dec 17, 2021 | 2:27 PM

ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌కు ముందు బిగ్ న్యూస్ వినిపిస్తోంది. టీమిండియా స్టార్ ప్లేయర్స్ ఆయా జట్లకు కెప్టెన్లుగా మారనున్నారని టాక్. అలాగే కీ ఆటగాళ్ల వైపు కూడా కొత్త జట్లు దృష్టి సారించాలని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు తమ కెప్టెన్‌లను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్.. లక్నో టీంకు కెప్టెన్ కానున్నాడట.

కెఎల్ రాహుల్‌తో పాటు రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్‌లను తీసుకోవాలని లక్నో ఫ్రాంచైజీ చూస్తోందట. ఇప్పటికే ఆయా ప్లేయర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రషీద్ ఖాన్ హైదరాబాద్ జట్టుకు, ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

అలాగే రెండో కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీ అహ్మదాబాద్.. శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఎన్నుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోందట. గతంలో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్.. గాయం కారణంగా టోర్నీ మధ్య నుంచి వైదొలిగాడు.

అహ్మదాబాద్ జట్టు శ్రేయాస్ అయ్యర్‌తో పాటు హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్వింటన్ డికాక్‌ను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 4 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మెగా వేలంలో కొందరు ఆటగాళ్లపై కన్నేసింది. శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లపై దృష్టి సారించింది.




