Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli-Sachin: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ.. ఒక్క అడుగు దూరంలో నిలిచిన టెస్ట్ సారథి.. అదేంటంటే?

IND vs SA: భారత్ ఈ ఏడాది ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడగా, అందులో 7 గెలిచి 3 ఓడింది. కాగా 3 టెస్టులు డ్రా అయ్యాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కూడా భారత జట్టు నుంచి అలాంటి ప్రదర్శననే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Kohli-Sachin: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ.. ఒక్క అడుగు దూరంలో నిలిచిన టెస్ట్ సారథి.. అదేంటంటే?
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Dec 17, 2021 | 2:56 PM

India vs South Africa: టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకుంది. ఈ టూర్‌లో 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. బాక్సింగ్ డే టెస్టుతో సిరీస్ మొదలుకానుంది. తొలి బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు చెందిన పలువురు కెప్టెన్లు విజయం సాధించారు. విరాట్ కోహ్లికి కూడా ఈ అనుభవం ఎదురైంది. అయితే ఈ సారి మాత్రం డిఫరెంట్‌గా చేసే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో గెలిస్తే రెండు బాక్సింగ్ డే టెస్టులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నాడు.

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవలేదు. దక్షిణాఫ్రికాలో ఈ ఘనత సాధించిన ఏకైక ఆసియా జట్టు శ్రీలంక. ఆ ఫీట్ చేసే అవకాశం టీమ్ ఇండియాకు కూడా ఉంది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో ఆ జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ ఏడాది మొత్తం టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన కూడా బాగుంది. భారత్ ఈ ఏడాది ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడగా, అందులో 7 గెలిచి 3 ఓడింది. కాగా 3 టెస్టులు డ్రా అయ్యాయి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కూడా భారత జట్టు నుంచి అలాంటి ప్రదర్శనను ఆశించవచ్చు.

సచిన్‌తో సరిపెట్టుకోవాల్సిన విరాట్! క్రికెట్ అనేది సమిష్టిగా ఆడాల్సిందే. దక్షిణాఫ్రికాలో బాగా ఆడాలంటే, మొత్తం జట్టు బాగా ఆడటం అవసరం. కానీ, సిరీస్ పరిస్థితిని, దిశను నిర్ణయించగల ఆటగాడు మాత్రం విరాట్ కోహ్లీ అనండంలో సందేహం లేదు. గత రెండేళ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న విరాట్.. ఆఫ్రికా గడ్డపై తన నిరీక్షణకు స్వస్తి పలికి, మెరుగ్గా రాణించి, సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తే.. దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలనే కల నెరవేరుతుందనడంలో సందేహం లేదు.

ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టైటిల్ విజయానికి కీలకం.. సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయడం ద్వారా విరాట్ కోహ్లి సారథ్యంలో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలనే కలను సాకారం చేసుకోవచ్చని తెలుస్తోంది. ఆ రికార్డ్ ఏంటంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్‌ను గెలుచుకోవడానికి సంబంధించినది. నిజానికి, సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధికంగా 20 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లి 19 సార్లు గెలిచి సచిన్ తరువాత స్థానంలో నిలిచాడు. అటువంటి పరిస్థితిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో సచిన్‌ను సమం చేసేందుకు అవకాశం విరాట్ ముందు నిలిచింది. అలాగే సిరీస్‌ కూడా గెలిస్తే.. భారత క్రికెట్ చరిత్రలో కూడా విరాట్ పేరు లిఖించేందుకు అర్హత సాధింస్తుంది.

Also Read: 26 బంతులు 73 పరుగులు 9 సిక్సర్లు.. వెంటనే ఫేమస్‌ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌

Rohit Sharma: సచిన్‌, కోహ్లీ, ఇప్పుడు రోహిత్‌.. అలీభాగ్‌లో సతీమణి పేరిట 4 ఎకరాల భూమి కొన్న హిట్‌మ్యాన్‌!