AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: సచిన్‌, కోహ్లీ, ఇప్పుడు రోహిత్‌.. అలీభాగ్‌లో సతీమణి పేరిట 4 ఎకరాల భూమి కొన్న హిట్‌మ్యాన్‌!

ప్రొఫెషల్‌ కెరీర్‌ పరంగా ఫుల్‌జోష్‌లో ఉన్నాడు టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ. మొదట టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 సిరీస్‌ని క్లీన్‌ స్వీప్‌ చేసి శుభారంభం

Rohit Sharma: సచిన్‌, కోహ్లీ, ఇప్పుడు రోహిత్‌.. అలీభాగ్‌లో సతీమణి పేరిట 4 ఎకరాల భూమి కొన్న హిట్‌మ్యాన్‌!
Basha Shek
|

Updated on: Dec 17, 2021 | 8:22 AM

Share

ప్రొఫెషల్‌ కెరీర్‌ పరంగా ఫుల్‌జోష్‌లో ఉన్నాడు టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ. మొదట టీ20 కెప్టెన్‌గా ప్రమోషన్‌ పొందిన హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 సిరీస్‌ని క్లీన్‌ స్వీప్‌ చేసి శుభారంభం అందుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్థానంలో వన్డే జట్టు పగ్గాలు, అజింక్యా రహానే ప్లేస్‌లో టెస్ట్‌ వైస్‌ కెప్టెన్సీని కూడా అందుకున్నాడు. ఇలా ఎంతో జోష్‌లో ఉన్న రోహిత్‌ తన సతీమణి రితికా సజ్‌దేహ పేరిట భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని దక్షిణ అలీబాగ్‌లో రూ.9 కోట్లతో 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడట. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో పాటు భూమి పూజ కూడా పూర్తిచేశాడట ఈ సొగసరి ఆటగాడు. కాగా హిట్‌మ్యాన్‌ కొన్న భూమి అలీభాగ్‌ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరళ్‌ మహాత్రోలి అనే గ్రామ పరిధిలో ఉంది. ‘ రోహిత్‌ తన భార్య రితికా పేరిట 4 ఎకరాలు కొన్నాడు. ప్రస్తుతం ఈ భూమి విలువు రూ. 9కోట్లకు పైగానే పలుకుతోంది. అలీభాగ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ముగించేశాడు. ఆతర్వాత మా గ్రామానికి వచ్చి కొనుగోలు చేసిన స్థలంలో భూమి పూజ చేశాడు’ అని సరళ్‌ మహాత్రోలి గ్రామ సర్పంచ్‌ అమిత్‌ నాయక్‌ చెబుతున్నాడు.

కాగా ఈ విషయంపై అలీభాగ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సంజన జాదవ్ స్పందిస్తూ ‘ భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి రోహిత్ మా కార్యాలయానికి వచ్చిన మాట వాస్తవమే. అయితే అతనే భూమిని కొన్నాడా లేదా అతనితో పాటు వచ్చిన వ్యక్తి కొనుగోలు చేశాడా అన్న విషయం మాకు తెలియదు’ పేర్కొన్నాడు. కాగా ముంబయి సమీపంలో ఉన్న అలీభాగ్‌ నగరానికి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా పేరుంది. ఇక్కడ ఎన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయి. అందుకు తగ్గట్లే భూములకు బాగా డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ కూడా అక్కడ భూమి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌, మాజీ కోచ్‌ రవిశాస్త్రికి కూడా ఇక్కడ భూములుండడం విశేషం.

Follow Us
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
ఇదేం పుకార్లురా నాయనా.. అంతా అబద్దమే.. బంగారంపై అసలు నిజం ఇదే..!
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
మహిళలకు పచ్చి బొప్పాయి వరప్రసాదం.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
కాలేజీలో ఏడాదిగా మూసి ఉన్న గది తెరిచి చూస్తే షాక్!
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
ఒకప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరో. క్యాటరింగ్ బిజినెస్‏లో..
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
5300 ఏళ్ల నాటి మమ్మీలో ఇంకా జీవం! శాస్త్రవేత్తలకు ఓట్జీ షాక్
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
రోహిత్-విరాట్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఎందుకో తెలుసా?
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
భారత్‌లో ఆ ఒక్క కారణంతోనే 70 శాతం పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
పుట్టినరోజుపై ఇరువురి వెర్షన్స్ ఎలా ఉన్నాయంటే..?
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
వైభవ్ సూర్యవంశీపై ఐఐఎమ్ అధ్యయనం.. అసలు కారణం ఏంటంటే!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!
బుధుడి కటాక్షం.. వారికి వ్యాపార పెట్టుబడులతో భారీ లాభాలు ఖాయం..!