AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!

BCCI: మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్ వరకు మొత్తం ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షేర్ చేసింది.

Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!
India Vs Sa
Venkata Chari
|

Updated on: Dec 17, 2021 | 3:02 PM

Share

India vs South Africa: మూడు టెస్టులు, మూడు వన్డేల కోసం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేరుకుంది. ముంబై నుంచి జోహన్నెస్‌బర్గ్ వరకు మొత్తం ప్రయాణానికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షేర్ చేసింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సరదాగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కోహ్లి కూడా ఇషాంత్ బ్యాగ్‌లోకి చూస్తూ ఏదో చెప్పగా, ఉదయం ఇలా చేయవద్దు అని ఇషాంత్ చెప్పడం కనిపించింది.

వీడియోలో, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ జంటగా నవ్వుతూ కనిపించారు. మరోవైపు ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానే కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆఫ్రికాకు చేరుకున్న భారత జట్టుకు స్వాగతం కూడా వీడియోలో కనిపిస్తుంది.

పంత్, అనుష్క శర్మ కూడా అక్కడి వీడియోలను పంచుకున్నారు.. భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక సరస్సుకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. అదే సమయంలో, అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అదే సరస్సు అందమైన వీడియోను కూడా పంచుకుంది. ఈ దృశ్యం టీమ్ ఇండియా హోటల్ సమీపంలో ఉంది.

ఒక రోజు నిర్బంధంలో.. భారత క్రికెట్ జట్టు కఠినమైన నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదు. అక్కడికి చేరుకున్న తర్వాత, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఒక్క రోజు మాత్రమే హోటల్‌లో ఒంటరిగా ఉంటుంది.

మ్యాచ్ షెడ్యూల్.. తొలి టెస్ట్: 26-30 డిసెంబర్ 2021 (సెంచూరియన్) రెండో టెస్ట్: జనవరి 3 నుంచి 7, 2022 (జోహన్నెస్‌బర్గ్) మూడో టెస్ట్: జనవరి 11 నుంచి 15, 2022 (కేప్ టౌన్)

వన్డే సిరీస్.. తొలి వన్డే: జనవరి 19, 2022 (పార్ల్) రెండో వన్డే: జనవరి 21, 2022 (పార్ల్) మూడో వన్డే: జనవరి 23, 2022 (కేప్ టౌన్)

Also Read: Kohli-Sachin: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ.. ఒక్క అడుగు దూరంలో నిలిచిన టెస్ట్ సారథి.. అదేంటంటే?

IPL 2022: ఐపీఎల్ స్టార్లంతా ఆ రెండు టీంలతోనే.. కీలక ప్లేయర్ల కోసం పక్కా ప్లాన్.. ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడే