AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పాక్, వెస్టిండీస్ మ్యాచులో ఫన్నీ సీన్.. అచ్చం వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్‌లాగే.. వైరలవుతోన్న వీడియో..!

PAK vs WI: 1996 ప్రపంచకప్‌ భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌కు చిరస్మరణీయమైనది. పాకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వెంకటేష్, పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ అమీర్ సోహైల్ మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదాన్ని ఏ క్రికెట్ అభిమాని అయినా మరచిపోలేరు.

Watch Video: పాక్, వెస్టిండీస్ మ్యాచులో ఫన్నీ సీన్.. అచ్చం వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్‌లాగే.. వైరలవుతోన్న వీడియో..!
Pakistan Vs West Indies
Venkata Chari
|

Updated on: Dec 17, 2021 | 4:11 PM

Share

Pakistan vs West Indies: పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఫన్నీ సీన్ కనిపించింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ వేసేందుకు మహమ్మద్ వసీం జూనియర్ రంగంలోకి దిగాడు. వెస్టిండీస్‌ ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ ఓవర్‌ ఐదో బంతికి భారీ సిక్సర్‌ బాదాడు. బంతి వెళ్లి స్టేడియం పైకప్పుపై పడింది. కింగ్ 20 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కానీ, ఆ తర్వాతి బంతికే మహ్మద్ వసీం జూనియర్ సత్తా చాటాడు. అతని అద్భుతమైన బంతుల్లో కింగ్ బౌల్డ్ అయ్యాడు. భారీ సిక్సర్ కొట్టిన తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అవ్వడం తో బౌలర్ ఆనందానికి హద్దులు లేవు. కింగ్ తన ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు. అదే సమయంలో, వసీమ్ జూనియర్ ఈ మ్యాచ్‌లో 44 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ రెండు బంతుల కథకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అచ్చం వెంకటేష్ ప్రసాద్, అమీర్ సోహైల్ ఇన్నింగ్స్‌లాగే.. 1996 ప్రపంచకప్‌ భారత బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌కు చిరస్మరణీయమైనది. పాకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వెంకటేష్, పాకిస్థానీ బ్యాట్స్‌మెన్ అమీర్ సోహైల్ మధ్య మైదానంలో జరిగిన వాగ్వాదాన్ని ఏ క్రికెట్ అభిమాని అయినా మరచిపోలేరు. ఈ మ్యాచ్‌లో కూడా, వెంకటేష్ వేసిన బంతికి అమీర్ మొదట అద్భుతమైన ఫోర్ కొట్టాడు. కానీ, ఆ తర్వాతి బంతికి వెంకటేష్ పునరాగమనం చేసి అమీర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

మ్యాచ్‌లో ఏం జరిగింది? పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. కరాచీ వేదికగా జరిగిన చివరి టీ20లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ల అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్ జట్టు 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. రిజ్వాన్ 45 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేయగా, బాబర్ ఆజం 53 బంతుల్లో 79 పరుగులు చేశాడు.

Also Read: Watch Video: సరదా.. సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో పంచుకున్న బీసీసీఐ..!

Kohli-Sachin: సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న విరాట్ కోహ్లీ.. ఒక్క అడుగు దూరంలో నిలిచిన టెస్ట్ సారథి.. అదేంటంటే?