- Telugu News Photo Gallery Know why people dont eat egg yolks and here are some myths check in detail
Egg Yolks: గుడ్డులోని పసుపు భాగాన్ని ఎంతమంది తినరు.? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు.!
రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పటికీ కొంతమందికి గుడ్డుపై అపోహలు చాలానే ఉన్నాయి...
Updated on: Dec 17, 2021 | 9:32 AM

రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పటికీ కొంతమందికి గుడ్డుపై అపోహలు చాలానే ఉన్నాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పసుపు భాగం తినకూడదని అంటారు. అంతేకాదు ఏకంగా అది తింటే గుండెపోటు వస్తుందని భయపడతారు. కొవ్వు పెరుగుతుందని అది ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తారు. మరి వీటిల్లో ఎంతవరకు నిజముందో.? ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు భాగాన్ని ఎందుకు తినకూడదు.? - గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ దాదాపు 185 గ్రాముల వరకు ఉంటుంది. అందువల్లే కొలెస్ట్రాల్‌ను నివారించడానికి చాలామంది ఈ పసుపు భాగాన్ని తినరు.

అలాగే క్యాలరీల విషయంలోనూ చాలామంది పచ్చసొనను తినడానికి ఇష్టపడరు. గుడ్డులో దాదాపు 72 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 55 కేలరీలు పచ్చసొనవి కాగా.. తెలుపు భాగంలో 17 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల, క్యాలరీల సంఖ్యను తగ్గించడంలో భాగంగా పసుపు భాగాన్ని తినరు.

అయితే ఇది ఎంతవరకు నిజం? కొలెస్ట్రాల్ విషయం గురించి మాట్లాడితే.. పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం కాదు. ఇదే కాకుండా గుడ్డులోని పచ్చసోనలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం కూడా.

గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ ఎ, డి, ఈ, కె, ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. ఫోలేట్, విటమిన్ B12 గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డు పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏ డైట్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఒకసారి డైటీషియన్ సలహా తీసుకోవాలి.





























