- Telugu News Photo Gallery Science photos Thousands of Starling Birds fly in sky to self protection at the time of migrate to Asia Countries in Winter
Starling Birds: వేలాది పిచ్చుకలాంటి చిన్న పక్షులు ఒకేసారి ఆకాశంలోకి ఎగిరితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా..
పక్షుల గురించి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. రాబందుల వంటి పెద్ద పక్షుల నుంచి తమను తాము రక్షిచుకోవడానికి స్టార్లింగ్ పిట్టలు ఏమి చేస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పక్షుల కథేమిటో ఫోటోలలో చూడండి
Updated on: Dec 17, 2021 | 9:03 AM

ఈ చిన్ని పిట్టను చూశారా? చూస్తుంటే అచ్చు మన పిచ్చుకలానే ఉంది కదూ. దీనిని స్టార్లింగ్ అంటారు. ఈ పక్షి బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ సహా ఐరోపాలోని అన్ని చల్లని దేశాల్లోనూ కనిపిస్తుంది.

ఈ పక్షులు ధాన్యం.. నీటిని వెతుకుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, అవి ఆకాశంలో గుంపులుగా బయటకు వస్తాయి. అప్పుడు చూడటానికి ఒక ద్భుతంలా కనిపిస్తుంది ఆ దృశ్యం. రాబందుల వంటి పక్షుల బారిన పడే ప్రమాదం లేకుండా ఇవి ఇలా ఒకేసారి గుంపుగా పైకి ఎగిరి వెళతాయి.

ఈ పిట్టల ప్రత్యేకత ఏమిటంటే, అవి ఎగిరినప్పుడు, సమూహంలో కనీసం వెయ్యికి పైగా పక్షులు ఉంటాయి. ఐరోపాలో భారీ హిమపాతం ప్రారంభమైనప్పుడు, ఈ పక్షులు.. నీటి కోసం ఆసియాకు వెళ్తాయి. వీటిలో, రోసీ స్టార్లింగ్ బృందం వర్షాకాలం ముగింపులో భారతదేశం వైపు వస్తుంది.

యూరప్ నుంచి కజకిస్తాన్, పాకిస్థాన్ మీదుగా భారత్ సరిహద్దు ప్రాంతాలకు ఈ పక్షుల గుంపు చేరుకుంటుంది. భారతదేశంలో ఈ పక్షులకు ఇష్టమైన ప్రదేశాలలో రాజస్థాన్ ఒకటి. ఇక్కడ ఇవి తరచుగా ఏప్రిల్ వరకు ఉంటాయి. ఒక సమూహంలో 1000 నుండి 10 వేల పిట్టలు ఉంటాయి. హిమపాతం తరువాత, అవి ఆహారం కోసం ఆసియా వైపు వస్తాయి.

ఈ పక్షుల సగటు వయస్సు 6-7 సంవత్సరాలు. ఇవి ఏడు నెలల పాటు యూరప్ లో ఉంటాయి. మిగిలిన ఐదు నెలలు యూరప్ వెలుపల ఉంటాయి. అప్పుడు ఇవి బ్రీడింగ్ అవుతాయి.

ఎకో ఫ్రెండ్లీ పక్షి: స్టార్లింగ్ ఎకో ఫ్రెండ్లీ పక్షి. వాటి ఆహారం వర్షం వల్ల వచ్చే కీటకాలు..సాలెపురుగులు. మర్రిలో పండే పండ్లను కూడా తింటుంది.





























