- Telugu News Photo Gallery Viral photos Why White Painting on Trees besides roads know about this interesting fact
Painting on Trees: రోడ్డు పక్క చెట్లకు తెల్లని రంగు ఎందుకు వేస్తారో తెలుసా? ఆ రంగు వేయకపోతే ఏమవుతుంది?
రోడ్డుకు రెండువైపులా ఉండే చెట్లకు తెల్లని రంగు వేసి ఉంటుంది. అది ఎందుకు వేస్తారో మీకు తెలుసా? ఆ రంగు వేయకపోతే ఏమి జరుగుతుందో.. అసలు ఎటువంటి రంగు దానికి వేస్తారో తెలుసుకుందాం రండి!
Updated on: Dec 17, 2021 | 9:56 AM

మీరు తరచుగా రోడ్డు లేదా హైవే పక్కన చెట్ల వరుసను చూస్తూ ఉంటారు. ఆ చెట్లకు కాండం చుట్టూ తప్పనిసరిగా తెల్లగా పెయింట్ చేసి ఉండటం గమనించే ఉంటారు. చెట్లకు తెల్లగా ఎందుకు పెయింట్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి దీని వెనుక సైన్స్ కూడా ఉంది. సున్నంతో చెట్ల పెయింటింగ్ కనెక్షన్ వాటి భద్రతకు సంబంధించినది. ఇది చెట్లను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

శాస్త్రీయంగా చెట్లకు తెల్లని సున్నం వేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సున్నంతో పెయింటింగ్ చేయడం ద్వారా చెట్టులోని ప్రతి కింది భాగానికి సున్నం చేరుతుంది. దీని వల్ల చెట్టుకు పురుగులు, చెదపురుగులు దరిచేరవు. చెట్టు వయసు పెరుగుతుంది. చెట్టు బయటి పొరను రక్షించడానికి సున్నం పనిచేస్తుంది. బయటి పొరపై సున్నం పూసినప్పుడు, దాని బెరడు పగలదని లేదా విరిగిపోదని నిపుణులు అంటున్నారు.

పై నుంచి నరికిన చెట్లు కొన్ని కనిపిస్తాయి. వాటికి మొత్తం తెల్లగా పెయింట్ చేసి ఉంటాయి. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధన ప్రకారం, పెయింటింగ్ లో ఉపయోగించే తెలుపు రంగు సూర్యుడి ప్రత్యక్ష కిరణాల వల్ల దెబ్బతిన్న కొత్త ఫోలికల్స్‌ను రక్షిస్తుంది. తెలుపు రంగు కారణంగా, కొత్త రెమ్మలకు నష్టం జరిగే ప్రమాదం తగ్గుతుంది.

చెట్లకు తెలుపు రంగు వేయడానికి మరో కారణం కూడా ఉంది. చాలా దూరం వరకు తెలుపు రంగులో పెయింట్ చేయబడిన ఈ చెట్లు వీధి లైట్లు లేని సమయంలో కూడా దారి చూపుతాయి. చీకట్లో వాటిపై వెలుగు పడగానే మార్గం ఎంత విశాలంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా దట్టమైన అటవీ మార్గాల్లో, ఇది ఖచ్చితంగా చేస్తారు. ఇది డ్రైవర్లకు సహాయపడుతుంది.

కార్నెల్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెట్లు పెయింట్ చేయడానికి ఎప్పుడూ ఆయిల్ పెయింట్ ఉపయోగించకూడదని చెబుతారు. ఇది చెట్ల పెరుగుదలపై చెడు ప్రభావం చూపుతుంది. సున్నం ఉపయోగించినట్లయితే, అప్పుడు నీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి, తద్వారా చెట్లకు ఎటువంటి హాని జరగదు.





























