AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: తగ్గేదే లే..! తాడోపేడో తేల్చుకునుడే..! కేంద్రంపై వార్ ప్రకటించిన సీఎం కేసీఆర్..

తగ్గేదే లే..! తాడోపేడో తేల్చుకునుడే..! మరోసారి కేంద్రంపై వార్ ప్రకటించారు సీఎం కేసీఆర్! ధాన్యం కొనుగోళ్ల విషయంలో అమీతుమీకి రెడీ అయ్యారు. యాక్షన్ ప్లాన్‌ ప్రకటించారు. మౌనంగా ఉండొద్దు..మాట్లాడాలి అంటూ పార్టీనేతలకూ దిశానిర్దేశం చేశారు.

CM KCR: తగ్గేదే లే..! తాడోపేడో తేల్చుకునుడే..! కేంద్రంపై వార్ ప్రకటించిన సీఎం కేసీఆర్..
Chief Minister Kcr Telangan
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2021 | 9:40 PM

Share

TRS – CM KCR: శనివారం ఢిల్లీకి మంత్రుల బృందం. కేంద్ర వైఖరికి నిరసనగా 20న గ్రామాల్లో నిరసనలు..! రైతుబంధు ఆపేప్రసక్తే లేదు..! దళితబంధు రాష్ట్రమంతా అమలు చేస్తాం..! టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలివి. తెలంగాణభవన్‌లో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రుల బృందం మరోసారి హస్తిన వెళ్లనుంది. కేంద్ర మంత్రులతో పాటు, ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌నూ కోరనున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు సీఎం కేసీఆర్. చురుగ్గా పని చేయండి. మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత నాదంటూ భరోసా ఇచ్చారు. పంటల మార్పిడి పై రైతులను చైతన్య పరచాలని మిల్లర్లతో టైఅప్ ఉన్నోళ్లను వరి వేసుకోనివ్వాలని చెప్పారు. వరి వేసేవాళ్లకు రైతుబంధు ఆపాలంటూ వ్యవసాయాధికారులు చేసిన సూచనను సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుబంధుని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలతో వన్‌ టు వన్ మాట్లాడి.. నియోజకవర్గాల వారీగా ఏమి జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. ఖమ్మం క్రాస్ ఓటింగ్ పై సీరియస్ అయ్యారు. క్రాస్ ఓటింగ్ చేసింది, చేయించింది ఎవరో తేలాలన్నారు. నియోజవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

ఏం మాట్లాడకపోతే మీకే నష్టమని యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలను కలుపుకొని పోవాలన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే ఉంటుందని త్వరలో ఉత్తర్వులు వస్తాయని చెప్పారు. రాష్ట్రమంతా పథకం అమలు చేస్తామని..మొదట ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇస్తామని తెలిపారు.

త్వరలో టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీ ప్రకటన ఉంటుందన్నారు సీఎం కేసీఆర్. జిల్లాలకు అధ్యక్షులా? లేదా కన్వీనర్‌ను నియమించాలా అన్నది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు,ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్ సేవలను వినియోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్.

ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్‌లో దగాపడిన బిగ్ బుల్..