AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..

మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశారా..? చేసిన ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారా..? ఇక ముందు ఆ బెంగ అవసరం లేదు... ఎందుకంటే..

మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..
Biryani
Sanjay Kasula
|

Updated on: Dec 17, 2021 | 7:29 PM

Share

Biryani Delivery Drone: ట్రెండ్ మారుతోంది.. మార్కెట్ స్టైల్ మారుతోంది.. ట్రెండ్, స్టైల్ రెండింటిని అందిపుచ్చుకుని ముందుకు సాగితేనే మార్కెట్ విన్నర్ అవుతారనేది బిజినెస్ సూత్రం. ఇప్పుడు ఇదే మంత్రాన్ని అందిపుచ్చకుంటున్నారు నేటి వ్యాపారులు. మీరు ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసినట్లయితే..   డెలివరీ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అదే ట్రెండ్‌ అమలు చేస్తూన్నారు.. ఆర్డర్ చేస్తే చాలు క్షణాల్లో మీ ఇంటి డోర్ ముందు వాలిపోతుంది. అవును.. ఇది నిజం. దేశంలో డ్రోన్ డెలివరీ ప్రారంభమైంది. ఫుడ్ డెలివరీ యునికార్న్ స్విగ్గీ, ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌స్పేస్ కంపెనీ ANRA టెక్నాలజీస్ భారతదేశంలో 300 కంటే ఎక్కువ డ్రోన్ డెలివరీల ఆహారం, మందులను విజయవంతంగా పరీక్షించాయి.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) , పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాజెక్ట్ కింద ఈ కంపెనీలు డ్రోన్ డెలివరీ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఈ పరీక్షలు పంజాబ్‌లోని రోపర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరప్రదేశ్‌లోని ఇటాహ్ జిల్లాలో ఈ ట్రాయల్ రన్ నిర్వహించారు.

ఇలా పరీక్షించారు..

100 గంటల కంటే ఎక్కువ విమాన సమయంలో 1100 కి.మీ విస్తీర్ణంలో 352 డ్రోన్‌లను పరీక్షించారు. ఈ ట్రయల్స్ నుండి పొందిన ఫలితాలు విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS) ఆపరేషన్ కోసం డ్రోన్ నియమాలను రూపొందించడంలో సహాయపడతాయి. BVLOS అనేది ఒక రకమైన డ్రోన్ మిషన్, ఇక్కడ మానవరహిత వైమానిక వాహనం (UAV) పైలట్ దృశ్యమాన పరిధికి మించి పంపిణీ చేస్తుంది.

తక్కువ సమయంలో డెలివరీ

డ్రోన్ డెలివరీని ప్రవేశపెట్టడంతో డెలివరీ సమయం మునుపటి కంటే తక్కువగా ఉంటుంది. ఇది మొత్తం సరఫరా చైన్ బిజినెస్‌ను మారుస్తుంది. దేశంలోని సుదూర ప్రాంతాలకు వస్తువులను పంపిణీ చేయడం చాలా ఈజీగా మారుతుంది. ఇది నిర్ణీత కాల వ్యవధిలో మందులు కానీ ఆహార పదార్థాలను డెలివరీ చేయడంలో సహాయపడుతుంది.

ఆందోళన అవసరం లేదు

ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు తరచుగా టెన్షన్ పడుతుంటారు. ఆర్డర్ చేసి ఫుడ్ ఎంత సమయంలో డెలివరీ అవుతుంది? చాలా సందర్భాలలో ఆహారం ఆలస్యంగా పంపిణీ చేయబడితే.. కొంతమంది దానిని తీసుకోవడానికి కూడా నిరాకరిస్తారు. ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ టైమ్‌లో దేని కోసం ఎదురుచూడటం అనేది అతిపెద్ద సవాలుగా మారుతుంది. ఆ కోణంలో కూడా ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: Bandi Sanjay: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ..

Chandrababu: అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి.. వారి మాయమాటలతో రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు ఆందోళన